Begin typing your search above and press return to search.

పంతం నీదా నాదా..కిలో చేపలు రూ.1.02 లక్షలు

By:  Tupaki Desk   |   24 March 2020 7:15 AM GMT
పంతం నీదా నాదా..కిలో చేపలు రూ.1.02 లక్షలు
X
మన మార్కెట్లో కిలో చేపలు ఎంతుంటాయి. రూ.120కి రవ్వులు దొరుకుతాయి.. ఇక బొమ్మె చాప కిలో 400 వరకు ఉంటుంది. ఖరీదైనవి ఓ 1000 వరకు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కిలో చేపలు ఏకంగా రూ.1.02 లక్షలు. ఎంటా చేపలు.. ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ రకం అని ఆశ్చర్యపోకండి.. అవి మన చెరువులో దొరికే సాధారణ చేపలే.. పంతం కోసం ఇలా రేటును పెంచుకుంటూపోయారు.

మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ మండలం గాజిరెడ్డి పల్లి పరిధిలో పంత కోసం కిలో చేపల రేటును ఏకంగా లక్ష రూపాయలు దాటించిన వైనం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. నాగిరెడ్డి చెరువు, పల్లెచెరువుల్లో చేపలు పట్టేందుకు వేలం నిర్వహించారు. ఈ గ్రామంలో కొందరు మత్య్సకారుల మధ్య విభేదాలతో వేలం పాటకు రెక్కలొచ్చాయి. వేలాన్ని దక్కించుకోవాలని గ్రామానికి చెందిన కాయితి దాసు కిలోకు ఏకంగా రూ.1,02000 చొప్పున వేలం పాట పాడి దక్కించుకున్నాడు. ఆయనకు ముందు అరిగె చిన్నపోచయ్య అనే వ్యక్తి రూ.99,600 పాట పాడాడు.

మత్య్సకార సంఘం నేతల మధ్య పంతాలు పట్టింపుల వల్ల సర్కారు వారి వేలం పాట పెరుగుకుంటూ పోయింది. ఇంతకీ ప్రభుత్వం ఇందులో కిలోకు కేవలం రూ.70 మాత్రమే పెట్టడం గమనార్హం. దీన్నే పంతానికి పోయి ఏకంగా లక్ష దాటించారు. సాధారణంగా వేలంలో కిలో చేపలకు రూ.100 కూడా పెట్టరని అధికారులు చెబుతున్నారు.