Begin typing your search above and press return to search.

2022లో 10 లక్షల మంది విదేశీయులకు అమెరికా పౌరసత్వం

By:  Tupaki Desk   |   8 Dec 2022 5:30 PM GMT
2022లో 10 లక్షల మంది విదేశీయులకు అమెరికా పౌరసత్వం
X
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యువకులకు అమెరికా వెళ్లాలని.. అక్కడ మంచి ఉద్యోగం చేయాలని.. డాలర్లు సంపాదించాలని కలలుగంటారు. ప్రతీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి చివరి గమ్యస్థానం అమెరికానే అనుకుంటారు.. అవకాశాల అమెరికా అర్హత కలిగిన యువకులను వారి దేశానికి ఆకర్షిస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది విదేశీయులు అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లుగా మారారని, ఇది గత 15 ఏళ్లలో అత్యధిక సంఖ్య అని వర్గాలు చెబుతున్నాయి.

దేశాల వారీగా ఎవరికి ఎంత మందికి అమెరికా పౌరసత్వం ఇచ్చారన్నది ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ 2021లో తిరిగి చూస్తే అమెరికా పౌరసత్వం పొందిన 8 లక్షల మంది విదేశీయులలో ప్రముఖ జాబితాలో 14% మెక్సికన్లు ,  7% భారతీయులు కావడం గమనార్హం.

"మాకు అప్పగించబడిన ప్రతి ఇమ్మిగ్రేషన్ కేసు యునైటెడ్ స్టేట్స్‌లో మెరుగైన జీవితాన్ని నిర్మించాలని కోరుకునే వ్యక్తి.. కుటుంబాన్ని సూచిస్తుంది. అమెరికాలో పనిచేయాలనుకునే వారి అంకితభావానికి కృతజ్ఞతలు తెలుపుతూ మానవీయమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను నిర్మించడంలో మేము పురోగతిని సాధించాము.

ముఖ్యంగా మేము సేవ చేసే వ్యక్తులందరికీ  పౌరసత్వం ఇచ్చి గౌరవిస్తాం.. రాబోయే సంవత్సరంలో మా ప్రతిష్టాత్మకమైన బ్యాక్‌లాగ్ ఖాళీ ఉద్యోగాల లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం మద్దతు ఉంటుంది" అని అమెరికా ఇమ్మిగ్రేషన్  డైరెక్టర్ ఉర్ మెండోజా జద్దౌ అన్నారు.

కానీ కరోనా మహమ్మారి తర్వాత.. ఇతర కారణాల వల్ల, ప్రస్తుతం భారతీయులు అమెరికాకి టూరిస్ట్ వీసా పొందేందుకు చాలా సమయం పడుతోంది. దాదాపు మూడేళ్లు వేచి ఉండాల్సి వస్తోంది.

అమెరికాకు మంచి ఆదాయాన్ని తెచ్చే విద్యావీసాలు మాత్రమే ప్రస్తుతం సకాలంలో ఇవ్వబడుతున్నాయి. అమెరికాలోని భారతీయులకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ కూడా నత్తనడకన జరుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.