Begin typing your search above and press return to search.

యూపీ విద్యార్థుల‌కు బీజేపీ ప‌రీక్ష‌

By:  Tupaki Desk   |   24 July 2017 6:06 AM GMT
యూపీ విద్యార్థుల‌కు బీజేపీ ప‌రీక్ష‌
X
బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం కంపెనీలు పిల్ల‌ల్ని టార్గెట్ చేయ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చూస్తున్న‌దే. రాజ‌కీయ పార్టీలు ఇప్పుడా బాట‌లో న‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఫ్యూచ‌ర్ ఓట‌ర్లు అయిన పిల్ల‌ల మీద పార్టీ ముద్ర బ‌లంగా ప‌డేలా స‌రికొత్త చ‌ర్య‌ల‌కు బీజేపీ తెర తీస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ కొత్త త‌ర‌హా వ్యూహాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు క‌మ‌ల‌నాథులు సిద్ధ‌మ‌తున్నారు. తాజా వైఖ‌రిపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా.. క‌మ‌ల‌నాథులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

దాదాపు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థుల్ని టార్గెట్ చేసేందుకు వీలుగా తాజా వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ క‌మ‌ల‌నాథులు చేప‌డుతున్న స‌రికొత్త విధానం ఏమిట‌న్న‌ది చూస్తే.. ప్ర‌ధాని మోడీ.. యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్.. ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌) ల మీద విద్యార్థుల‌కు ఉన్న అవ‌గాహ‌న‌ను తెలుసుకునేందుకు ప్ర‌త్యేక ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించ‌నున్నారు.

దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని యూపీ వ్యాప్తంగా నిర్వ‌హించ‌నున్నారు. బీజేపీ నేతృత్వంలో ఆగ‌స్టు 26 నుంచి యూపీ వ్యాప్తంగా ఈ పోటీని నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌లో కేంద్రంలో మోడీ స‌ర్కారు.. యూపీలో యోగి స‌ర్కారు తీసుకున్న కీల‌క నిర్ణ‌యాలు.. చేప‌ట్టిన అభివృద్ధి ప‌థ‌కాల మీద ప్ర‌శ్న‌లు ఉండ‌నున్నాయి. ప‌రీక్ష రాసిన విద్యార్థుల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చూపిన విద్యార్థుల్ని ఘ‌నంగా సన్మానించ‌నున్నారు. ప్ర‌తి జిల్లాలో టాప్ టెన్ విద్యార్థుల్ని ఎంపిక చేయ‌నున్నారు. మొత్తానికి విద్యార్థుల మీద బ‌ల‌మైన ముద్ర వేసేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.