Begin typing your search above and press return to search.
యువగళానికి నెల : లోకేష్ జోరు పెంచారా...బోరు కొట్టించారా..?
By: Tupaki Desk | 27 Feb 2023 7:21 PM GMTతెలుగుదేశం పార్టీకి ఆయన వారసుడు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు తన భారాలన్నీ పక్కన పెట్టి జిల్లాల టూర్లు వేస్తున్నా బుర్ర వేడెక్కించేలా రాజకీయం చేస్తున్నా అన్నీ లోకేష్ కోసమే. తండ్రి అపర చాణక్యుడు. మరి చినబాబు ఎలాంటి వారు అంటే నిజంగా బాబుతో పోలిస్తే రాజకీయంగా చినబాబే. తన కోసం తండ్రి పడుతున్న తపనను చూసి అయినా లోకేష్ లో మార్పు రావాలి అన్నది టీడీపీలోనే ఒక గుసగుస ఎప్పటి నుంచో ఉంది.
మొత్తానికి అందరి కోరికను మన్నించి చినబాబు యువగళం పేరుతో జనంలోకి వచ్చారు. నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల దూరం అంటూ ఆయన సొంత టార్గెట్ పెట్టుకున్నారు. కుప్పం టూ ఇచ్చాపురం అని రూట్ వేసుకున్నారు. చినబాబు గత నెల 27న అంటే సరిగ్గా నెల రోజుల క్రితం తొలి అడుగులు వేశారు. ఇప్పటికి ఆయన పాదయాత్ర చూస్తే మూడు వందల కిలోమీటర్ల పై దాకా నడిచారు. ఇంకా చాలా దూరం లక్ష్యం ఉంది.
అయితే పాదయాత్ర మీద బయట రిపోర్టులు అన్నీ ఏవరేజ్ గా ఉన్నాయనే అంటున్నారు. లోకేష్ కి ఇది మంచి అవకాశం అయినప్పటికీ ఆయన సరైన తీరులో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అని అంటున్నారు. పాదయాత్ర ఏదైనా ఒక ఆకర్షణ ఉండాలి. ఒక అజెండా ఉండాలి. ఒక కంటెంట్ ఉండాలి. కానీ లోకేష్ మాత్రం యువతను టార్గెట్ చేయాలని మొదలెట్టిన నడక గతి తప్పుతోందని కామెంట్స్ వస్తున్నాయి. రొడ్డకొట్టుడు స్పీచ్ తో లోకేష్ జనాలను ఒక దశలో బోర్ కొట్టిస్తున్నారు అని కూడా సెటైర్లు పడుతున్నాయి.
లోకేష్ పాదయాత్ర కోసం పార్టీ కష్టపడుతోంది. ఆయన్ని ఫ్యూచర్ లీడర్ గా చేయాలని చంద్రబాబు డైరెక్షన్ లో టీడీపీ టాప్ టూ బాటం పనిచేస్తోంది. కానీ యువగళం హీరో అయిన లోకేష్ మాత్రం తాను ఏమి చెప్పాలనుకుంటున్నారో అది మరచిపోతున్నారు అని అంటున్నారు. లోకేష్ యువకుడు. నాలుగు పదుల ఏజ్ వాడు. ఆయన యువతను పార్టీ వైపుగా ఆకట్టుకోవాలి. ఎపుడో అన్న ఎన్టీయార్ టైం లో పాతికేళ్ళ యువకులు అంతా టీడీపీలోకి వచ్చి ఇపుడు షష్టి పూర్తులు దాటేసి సీనియర్ సిటిజన్లు అయిపోయారు.
టీడీపీ మరో నలభయ్యేళ్ళు మనుగడ సాగించాలంటే యువ రక్తాన్ని పార్టీకి ఎక్కించాలి. సరిగ్గా మంచి పాయింట్ నే టీడీపీ పట్టుకుంది. యువ నేతగా ఉన్న లోకేష్ ని ఫోకస్ చేసినట్లు అవుతుందని పాదయాత్రకు డిజైన్ చేసింది. అయితే లోకేష్ మాత్రం అసలు కంటెంట్ ని పక్కన పెట్టేసి కేవలం జగన్ మీదనే విమర్శలు చేయడం మొదలెట్టారు. జనవరి 27న కుప్పంలో జరిగిన సభలో జగన్ని ఎలా విమర్సించారో ఇపుడు అదే తీరున ఆయన విమర్శలు సాగుతున్నాయి.
ప్రతీ దానికీ జగన్ తో ముడిపెడుతున్నారు. జగన్ని ముగ్గులోకి లాగుతున్నారు. సవాల్ చేస్తున్నారు. ఇలా జగన్నామస్మరణతో నెల రోజులు గడచిపోయాయని అంటున్నారు. మరి మిగిలిన కాలమైనా లోకేష్ పాదయాత్రలో మార్పులు చేసుకుని తన స్పీచ్ ని మార్చుకుంటారా అన్నదే అందరిలో కలిగే డౌట్. జగన్ని తెల్లారి లేస్తే తూర్పారా పట్టడానికి చంద్రబాబు ఉన్నారు. ఇతర సీనియర్ నేతలు ఉన్నారు.
వారు ఆ పని చూసుకుంటారు. లోకేష్ మాత్రం యువతకు తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామని చెప్పాలి. యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని ప్రస్తావించాలి. ప్రభుత్వం మీద నేరుగా కామెంట్స్ చేయకుండా యువతకు తాము ఏమి చేయబోయేది చెబితే వారు అట్రాక్ట్ అవుతారు. అంతే తప్ప జగన్నే అన్నింటికీ కారుకుడు అంటూ విమర్శలు చేయడం వల్ల యువగళం లో యువ ఎలిమెంట్ మిస్ అయిందని అంటున్నారు.
పేరుకు యువగళం కాబట్టి సీనియర్లను పక్కన పెట్టేశారు. మరి యువతను అయినా దగ్గరకు తీసుకోకపోతే ఈ పాదయాత్రకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అన్నదే పార్టీలోని మాట. బయట రాజకీయ పార్టీలు కూడా లోకేష్ పాదయాత్రను లైట్ తీసుకుంటున్నాయంటే ఇదే కారణం అంటున్నారు. తిట్టడానికి కాళ్ళను నొప్పి పెట్టించకు చినబాబూ. విషయం ఉంటే చెప్పడానికి జనం వద్దకు వస్తే మేలు అంటున్నారు. మరి నెల రోజుల రిపోర్టుని అయినా చూసుకుని లోకేష్ మార్చుకుంటారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.