Begin typing your search above and press return to search.
భూమా అల్లుడు తగ్గట్లేదబ్బా..ఖాకీలపైనే దౌర్జన్యమట!
By: Tupaki Desk | 21 Oct 2019 4:15 PM GMTభూమా మార్కు అంటే... ఠక్కున గుర్తుకు వచ్చేది దౌర్జన్య కాండే. భూమా నాగిరెడ్డి మరణించినా.. ఆయన వారసురాలిగా రాజకీయాల్లో కొనసాగుతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఓ మోస్తరు సైలెంట్ గానే ఉంటున్నా... ఆమె భర్త భార్గవ్ రామ్ మాత్రం భూమా మార్కు గిరీని కొనసాగిస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికే తనదైన మార్కు దౌర్జన్యంతో వార్తల్లోకి ఎక్కిన భార్గవ్ రామ్... తాజాగా ఏకంగా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. భార్గవ్ రామ్ ఆళ్లగడ్డలో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్న వైనం నేపథ్యంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదు కాగానే... హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన భార్గవ్ రామ్... తనను విచారించేందుకు వచ్చిన పోలీసులపై ఇప్పటికే ఓ సారి దౌర్జన్యానికి దిగారు. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసు అధికారిని కారుతో గుద్ది చంపేసేందుకు యత్నించారన్న వార్తలు అప్పుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనను మరిచిపోక ముందే... భార్గవ్ రామ్ మరోమారు వార్తల్లో నిలిచారు. ఈ సారి కూడా తనను విచారించేందుకు వచ్చిన ఆళ్లగడ్డ పోలీసులపై భార్గవ్ రామ్ దౌర్జన్యానికి దిగాడట. హైదరాబాద్ లోని గణపతి కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న భార్గవ్ రామ్ ను విచారించేందుకు సోమవారం ఆళ్లగడ్డ నుంచి పోలీసులు వచ్చారట. అయితే తన ఇంటికి వచ్చిన పోలీసులపై భార్గవ్ రామ్ తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి దిగాడట. ఓ కానిస్టేబుల్ చేతిలోని సెల్ ఫోన్ ను కిందకు గిరాటేసిన భార్గవ్ రామ్... సదరు కానిస్టేబుల్ ను బయటకు తోసేశారట.
బార్గవ్ రామ్ కు తోడుగా ఆయన అనుచరులు కూడా పోలీసులకు చుక్కలు చూపారట. ఈ మొత్తం తంతును కాస్తంత ఓపిగ్గానే భరించిన పోలీసులు... భార్గవ్ రామ్ అనుచరుల వీరంగం మరింత ఎక్కువ కావడంతో భార్గవ్ రామ్ అనుచరులుగా ఉన్న పవన్ - బిన్నయ్య - చిన్నయ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భార్గవ్ రామ్ తమపై దుసురుగా వ్యవహరించిన తీరును పోలీసులు ఉన్నతాధికారులకు నివేదించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా భూమా అల్లుడిగా భార్గవ్ రామ్ తనదైన శైలి దౌర్జన్య కాండను కొనసాగిస్తున్నాడన్న మాట.