Begin typing your search above and press return to search.
కోడెల కొడుకు కక్కుర్తి మరొకటి బయటకొచ్చింది!
By: Tupaki Desk | 19 Jun 2019 8:20 AM GMTపీకల్లోతు ఆరోపణలతో కూరుకుపోయిన కోడెల కుటుంబం మీద మరో ఫిర్యాదు బుక్ అయ్యింది. ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ కొడుకు..కుమార్తెలు తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. పలు దుర్మార్గాలకు పాల్పడినట్లుగా వారి మీద ఆరోపణలువెల్లువెత్తటం తెలిసిందే.
నరసరావుపేట పరిధిలో పలు దందాలు చేసినట్లుతా ఇప్పటికే పలు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. కె ట్యాక్స్ (కోడెల) పేరుతో భూదందాలు మొదలుకొని పలు వర్గాలకు వారి మీద డబ్బులు కొల్లగొట్టిన వారికి సంబంధించి తాజాగా మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. కొన్నేళ్లుగా కోడెల శివరాం గౌతం కమ్యూనికేషన్ పేరుతో కే ఛానల్ ను నిర్వహిస్తున్నారు.
అయితే.. వారు అక్రమంగా స్టార్ మా కార్యక్రమాలకు సంబంధించి డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీకి పాల్పడుతున్న వైనాన్ని పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఇదే అంశంపైగతంలో స్టార్ టీవీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో స్పందించిన న్యాయస్థానం అడ్వకేట్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఏప్రిల్ 18న రాజాగారి కోటలోని మాజీ స్పీకర్ కోడెల నివాసగృహంలో నిర్వహిస్తున్న కే ఛానల్ సంస్థ ఆఫీసుపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసారాల్ని చౌర్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కోర్టు సమన్లు జారీ చేసినా స్పందించలేదు. ఇదిలా ఉండగా.. ప్రసారాల్ని చౌర్యం చేసిన వైనంపై స్టార్ మా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.