Begin typing your search above and press return to search.
టీ కాంగ్రెస్ వికెట్ మరొకటి ఫట్.. కేటీఆర్ భేటీకి సుధీర్ రెడ్డి రెఢీ!
By: Tupaki Desk | 15 March 2019 11:17 AM GMTఅనుకున్నట్లే జరుగుతోంది. అంచనాలు ఏ మాత్రం మిస్ కాని రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ను దాదాపు ఖాళీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ వేశారని.. ఇందులో భాగంగా ఇప్పటికి ఆరుగురు ఎమ్మెల్యేలను గులాబీ కారు ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసిన ఆయన.. మరో ఏడుగురి మీద కన్నేసినట్లుగా జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా.. తొలి నుంచి కాంగ్రెస్ తప్ప మరే పార్టీ మారని నేతగా.. రాజకీయంగా ఎత్తు పల్లాలు చూసిన నేతగా సుపరిచితుడు.. ఇటీవల జరిగిన టీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన సుధీర్ రెడ్డి.. తాజాగా గులాబీ కారు ఎక్కేందుకు రెఢీ అవుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇటీవల చేవెళ్ల చెల్లెమ్మ పార్టీ మారే క్రమంలో ఆమెను బుజ్జగించటానికి.. ఆమెను కాంగ్రెస్ లోనే ఉండిపోవాలని కోరేందుకు ఆమె ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన సుధీర్ రెడ్డి.. ఈ రోజున ఆయన కూడా పార్టీ మారేందుకు రెఢీ అవుతున్నారు.
టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యేందుకు.. ఆయనతో చర్చలు జరిపేందుకు ఆయన టైం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.అన్ని అన్నుకున్నట్లే జరిగితే ఈ రోజు కేటీఆర్ తో భేటీ అయ్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావటం ఖాయమంటున్నారు. పార్టీలో చేరే వారికి.. అందునా కేటీఆర్ తో భేటీ అయ్యే వారికి.. అన్ని అనుకున్నట్లు జరిగితే కేటీఆర్ చేతుల మీదుగా చిన్న మొక్కను తీసుకునే నేత సుధీర్ రెడ్డే అవుతారని చెబుతున్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం సుధీర్ తో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ కారులో ఎక్కేందుకు రెఢీగా ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. వారంతా కేటీఆర్ నే కలుస్తారా? టీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలుస్తారో చూడాలి.