Begin typing your search above and press return to search.
హోదా కోసం మరో బలిదానం!
By: Tupaki Desk | 31 Aug 2018 4:32 PM GMTఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చేసిన నయవంచనకు నిరసనగా కొంతకాలంగా ఏపీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. ఏపీకి హోదా ఇవ్వని బీజేపీపై....ప్యాకేజీకి అంగీకరించి సడెన్ గా యూటర్న్ తీసుకున్న టీడీపీపై నవ్యాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీకి హోదా కోసం పలువురు ప్రాణత్యాగం చేశారు. మరెందరో ఆత్మహత్యకు యత్నించారు. అయినప్పటికీ కేంద్రం మనసు కరగలేదు. ఈ క్రమంలోనే తాజాగా, ప్రత్యేక హోదా కోసం మరో యువకుడు బలయ్యాడు. ప్రత్యేక హోదా రానందుకు కలత చెందిన రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద సెల్ టవర్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోదా కోసం మరో యువకుడు అమరుడయ్యాడు. హోదా కోసం ప్రాణత్యాగానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు. సీఎం చంద్రబాబు నాయుడు పేరిట రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నాడు. హైద్రాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు...అంతే శ్రద్ధ ప్రత్యేక హోదా విషయంలో చూపించాలని త్రినాథ్ కోరాడు. త్రినాథ్ మృతి పట్ల ప్రతిపక్ష నాయకుడు - వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
``అయ్యా.. సీఎం గారు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మీరు చూపించిన శ్రద్ధ - ప్రత్యేక హోదా విషయంలో చూపించండి. అప్పుడే నా మరణానికి ఒక అర్ధం - మా అమ్మ నన్ను కన్నందుకు ఒక ప్రయోజనం. కేరళ వరదల్లో ఉందని అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలని తమ సమయాన్ని ధన రూపంలోను - మాటల రూపంలో ఆదుకుంటున్నారు. ముఖ్యంగా మీడియా - సినీ ప్రముఖులు ముందుకొచ్చి సహాయాన్ని అడుగుతున్నారు. ఇది తప్పు అని అనడం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ వరద బాధితులు సార్ ఏపీ ప్రజలు. దయచేసి గుర్తించండి. ప్రత్యేక హోదా విషయంలో సినీ - రాజకీయ - పారిశ్రామివేతలు ఆదుకోవాలి. మాట తప్పినందుకు అమ్మా నన్ను క్షమించు. అమ్మను జాగ్రత్తగా చంటిపిల్లలా చూసుకోండి’ అంటూ త్రినాథ్ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, త్రినాథ్ మృతి పట్ల ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్రినాథ్ కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోదా కోసం ఎవరూ ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని - పోరాటాల ద్వారా ప్రత్యేక హోదా సాధించుకుందామని జగన్ పిలుపునిచ్చారు.