Begin typing your search above and press return to search.
కోడెలకు మరో ఝలక్!
By: Tupaki Desk | 28 Jun 2019 2:30 PM GMTఇప్పటికే తన సంతానంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో మాజీ స్పీకర్, తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు ఇరకాటంలో పడిపోయారు. కోడెల దూడల బాధితులు అంటూ అనేక మంది పోలిస్ స్టేషన్లకు ఎక్కారు. తమ నుంచి కోడెల కూతురు, కొడుకు భారీ ఎత్తున బెదిరించి డబ్బులు తీసుకున్నారని వారు ఫిర్యాదులు చేశారు.
అందుకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయి. కోడెల శివప్రసాద్ రావు మీద కూడా కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతానికి అయితే కోడెల సంతానం పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఆ సంగతలా ఉంటే సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కోడెలపై అసమ్మతి పెరుగుతూ ఉంది. కోడెల నాయకత్వంపై ఆ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు మొదలైన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
కోడెల నియోజకవర్గ స్థాయిలో సమీక్ష నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో అక్కడి టీడీపీ నేతలు ఆ అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. కోడెల శివప్రసాద్ రావు తీరు సరిగా లేదని.. ఆయన ను నాయకత్వ స్థానం నుంచి మార్చాలని, ఆయనకు నియోజకవర్గం కేడర్ తో కానీ, ప్రజలతో కానీ సత్సంబంధాలు లేవని అసమ్మతి నేతలు అంటున్నారని సమాచారం. మరి ఈ అసమ్మతి కార్యకలాపాలు తీవ్రం అయితే అది సత్తెనపల్లిలో కోడెలకు మరో పెద్ద తలనొప్పి అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు!