Begin typing your search above and press return to search.

నిర్భయ కేసులో మరో ట్విస్ట్..ఉరి ముగ్గురికే.. కారణం ఇదే !

By:  Tupaki Desk   |   31 Jan 2020 10:19 AM GMT
నిర్భయ కేసులో మరో ట్విస్ట్..ఉరి ముగ్గురికే.. కారణం ఇదే !
X
నిర్భయ కేసులో విచారణ గత కొన్నేళ్లుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఒక రుపుకిరాలేకపోతుంది. ఈసారి నిందుతులకి ఉరి శిక్ష ఖాయం అనుకున్న ప్రతిసారి కూడా ..శిక్ష అమలు తారీకు వచ్చే సమయానికి ఎదో ఒకటి చేసి మళ్లీ ఉరి శిక్ష సమయాన్ని పొడిగించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫ్రిబవరి 1న న ఉరి ఖాయం అని అనుకున్నారు. కానీ , ఈ ఫ్రిబవరి 1న దోషులకు ఉరిశిక్ష అమలుపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు మేరకు నిర్భయ దోషులు అక్షయ్‌ ఠాకూర్‌, ముకేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మకు ఫిబ్రవరి 1న మరణ దండన విధించాల్సి ఉంది. అయితే, శిక్ష నుంచి తప్పించుకునేందుకు, దోషులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా.. వినయ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ ను రాష్ట్రపతి తిరస్కరించినందున నిబంధనల ప్రకారం మరో దోషి ముకేశ్‌ కు మాదిరిగానే ఇతడికీ 14 రోజుల గడువివ్వాలని, అందుకు ఉరిశిక్ష ను వాయిదా వేయాలని వారి తరపు లాయర్‌ ఏపీ సింగ్‌ పటియాల కోర్టులో పిటిషన్‌ వేశారు. దీని పై కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు ఇవ్వనుంది. అయితే , ప్రభుత్వం మాత్రం ఒకేసారి నలుగురిని ఉరి తీయాలన్న నిబంధనేమీ లేదని, మిగిలిన ముగ్గురినీ ఉరి తీయవచ్చని తెలిపింది. మరోవైపు ఉరిశిక్ష సమయం దగ్గరపడుతోన్నకొద్దీ దాన్ని వీలైనంత జాప్యం చేసేందుకు నిర్భయ కేసు దోషులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.. అత్యాచారం జరిగిన సమయం లో తాను మైనర్‌ను అని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షను తగ్గించాలని.. కొన్ని రోజుల క్రితం అతను సుప్రీంను కోరాడు. అయితే, అతని విజ్ఞప్తిని తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. తాజాగా పవన్ మళ్లీ ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశాడు. అయితే, నలుగురిని ఒకేసారి ఉరి తీయాలని కోర్టు ఆదేశించడం తో.. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు జైలు అధికారులు పూర్తి చేసారు. ఈ నేపథ్యంలో వినయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌ లో ఉండటం తో మిగతా ముగ్గురి కి ఉరిశిక్ష అమలు చేయొచ్చని కేంద్రం తెలిపింది. చూడాలి మరి దీనిపై కోర్టు ఏ విదంగా స్పందిస్తుందో ...