Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికలపై జగన్ సర్కార్ కు ఎస్ఈసీ మరో ట్విస్ట్

By:  Tupaki Desk   |   17 Dec 2020 11:10 AM GMT
స్థానిక ఎన్నికలపై జగన్ సర్కార్ కు ఎస్ఈసీ మరో ట్విస్ట్
X
చంద్రబాబు హయాంలో నియామకమైన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు.. జగన్ సర్కార్ మధ్య ఫైట్ కొనసాగుతూనే ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వీరిద్దరి మధ్య మొదలైన లొల్లి ఎంత పెద్ద ఇష్యూ అయ్యిందో అందరికీ తెలిసిందే.

తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్టుదలగా ఉన్నాడు. జగన్ సర్కార్ నిర్వహించలేమని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

స్తానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలుచేసిన పిటీషన్ పై ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం వేసిన పిటీషన్ ను డిస్మిస్ చేయాలని హైకోర్టును కోరారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ పేరుతో ఎన్నికలు అడ్డుకోవద్దని.. రాష్ట్రవ్యాప్తంగా గతంలో రోజుకు 10వేల కేసులు.. ఇప్పుడు 3వేల కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అన్ని తెరుచుకున్నాయని.. ఇప్పుడు ట్రయల్స్ దశలోనే వ్యాక్సిన్ ఉందని ఎస్ఈసీ కోర్టుకు తెలిపారు. ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసరికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని.. ఎన్నికల వల్ల వ్యాక్సిన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని.. ఎన్నికల విధుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు తెలిపిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, బీహార్, రాజస్థాన్ లో ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ పిటీషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనికి ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.