Begin typing your search above and press return to search.
స్వర్గంలో ఒక రాత్రి.. రెంటు రూ.58 లక్షలు..!
By: Tupaki Desk | 20 Jan 2021 11:30 PM GMTప్రేయసి కావొచ్చు, అర్ధాంగి కావొచ్చు.. ప్రియుడు కావొచ్చు, మొగుడు కావొచ్చు.. వారితో ఏకాంతంగా గడపాలంటే సముద్ర తీరానికి మించిన ప్రదేశం మరొకటి ఉండదు. వెండి వెన్నెల్లో ఇసుక తిన్నెలపై కూర్చొని, అంతులేని సముద్రాన్ని చూస్తూ.. అనంతమైన ప్రేమలో మునిగి.. ఇద్దరూ ఊసులు చెప్పుకుంటుంటే ఎలా ఉంటుంది? అక్కడే ఆ రాత్రి గడిపితే ఇంకెలా ఉంటుంది? మీ ఇమాజినేషన్ ఎలా ఉంటుందో గానీ.. తప్పకుండా ఓ మధురానుభూతిగా మాత్రం మిగిలిపోతుంది. ఇలాంటి కపుల్స్ కోసమే సముద్ర తీరాల్లో ప్రత్యేకమైన హట్స్, రిసార్టులు వెలుస్తుంటాయి.
ఇటువంటి రిసార్టులకు ఫేమస్ మాల్దీవులు. 26 ద్వీపాల సముహమైన మాల్దీవ్స్‌లో సహజమైన బీచ్‌లు, చల్లటి వాతావరణం స్వర్గాన్ని తలపిస్తుంటాయి. అందుకే.. అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం రిసార్టులు, ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్స్, బెడ్‌రూం విల్లాలు ఎదురు చూస్తుంటాయి. ఇంత వరకూ బాగానే ఉందిగానీ.. ఇక్కడ విడిది చేయాలంటే మాత్రం కాస్త ఖర్చు చేయాల్సి వస్తుంది.
డబ్బుండాలేగానీ.. నూటికి 99 పనులు కాదు, సరిగ్గా ట్రై చేస్తే వందకు వంద పనులూ అవుతాయంటాడు ఓ సినిమాలో అర్జున్. అలాంటి డబ్బున్నవారంతా.. లాక్‌డౌన్ ముగియడంతో రెక్కలు కట్టుకొని ఈ మాల్దీవుల్లో వాలిపోతున్నారు. ఇలాంటి వారికోసం లేటెస్ట్ గా మాల్దీవుల్లోని ఇథాఫుషి దీవిలో కొత్తగా ఓ ప్రైవేటు లగ్జరీ రిసార్టును నిర్మించారు. ఈ రిసార్టు పర్యాటకులను తెగ ఆకట్టుకుంటోంది.
అంత ఖరీదైన ఈ ద్వీపంలో మూడు బీచ్ విల్లాలతో కూడిన లగ్జరీ బెడ్‌రూమ్‌లు, రెండు ఓవర్ వాటర్ బెడ్‌రూమ్‌లు, రెసిడెన్సీ బెడ్‌రూంలతో పాటు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. వినోదం కోసం ఒక క్లబ్‌హౌస్ కూడా ఉంది. అదే విధంగా వాటర్‌స్పోర్ట్స్, డైవింగ్, యాచ్ ట్రిప్స్, ధ్యానం, యోగా సెంటర్లు, పిల్లలకు ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్, గేమింగ్ ఏరియాతో పాటు పూర్తిస్థాయి జిమ్ కూడా ఈ రిసార్టులో ఉంది.
ఈ రిసార్టును ఈ వారంలోనే ప్రారంభించారు. ఇక్కడ ఒకేసారి దాదాపు 24 మంది స్టే చేయవచ్చు. ఈ ద్వీపానికి వెళ్లాలంటే పడవలో 40 నిమిషాలు.. విమానంలో 15 నిమిషాలు పడుతుంది. ఇన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ ద్వీపానికి మీరు గానీ వెళ్లాలనుకుంటే.. కొంచెం ఖర్చు చేయాలని చెప్పాం కదా.. అంటే, మరీ అంత ఎక్కువేం కాదు.. జస్ట్ రూ.58,49,600 ఒక రాత్రికి!