Begin typing your search above and press return to search.

కేసీఆర్ విజయం..ఈ పత్రికాధినేత ఒప్పుకోవడం లేదు..

By:  Tupaki Desk   |   8 Dec 2018 4:18 AM GMT
కేసీఆర్ విజయం..ఈ పత్రికాధినేత ఒప్పుకోవడం లేదు..
X
అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో గులాబీ గుభాళిస్తుందని స్పష్టం చేశాయి. కానీ తెలుగురాష్ట్రం లోని ఆ పత్రికాధినేత మాత్రం హంగ్ అంటూ జనాలను - కాంగ్రెస్ ను సంతృప్తి పరిచేలా కథనాలు ఈరోజు వండివర్చాడు. ఆయన చానెల్ కూడా కేసీఆర్ విజయాన్ని ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. బయటకొచ్చి చెప్పిన ఓటర్లందరూ కారుకే వేశామని చెప్తున్నా.. కాంగ్రెస్ గెలుపును భుజానా వేసుకొని లాబీయింగ్ చేసిన ఆ పత్రికాధినేత మాత్రం హంగూ.. కింగూ అంటూ రాసుకొచ్చాడు.

ఈ మధ్యే కేటీఆర్ వాపోయారు. తమతో కలిసి ఇన్నాల్లు నడిచిన ఆ రెండు పత్రికలు.. పత్రికాధినేతలు నెలరోజులుగా కాంగ్రెస్ తో జట్టుకట్టి కుట్రపన్ని తమను ఓడించడానికి ప్రయత్నించాయని.. ఈ నెల 12న వారి బండారం బయటపెడతానని పోలింగ్ కు ముందు రోజు హెచ్చరించారు.

అధికారంలో ఉన్న వారితో ఈ నాలుగేళ్లు అంటకాగిన ఆ ఇద్దరు మీడియా అధిపతులు సడన్ గా కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. టీఆర్ ఎస్ ఓడిపోతుందంటూ తమ మీడియాల్లో విస్తృత ప్రచారం చేశారు. మీడియా మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన చంద్రబాబు అండదండలతో తమ పత్రికలు - మీడియాలో కాంగ్రెస్ ప్రకటనలు హోరెత్తించారు. సున్నా నుంచి మొదలైన కాంగ్రెస్ ప్రస్తానాన్ని టీఆర్ ఎస్ కు సమఉజ్జీగా తీసుకురావడంలో బాబు అనుకూల మీడియా విజయం సాధించింది.

కానీ జనాలు ఊరుకుంటారా.? పక్కరాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణను అల్లకల్లోలం చేస్తారన్న కేసీఆర్ మాటలనే నమ్మారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ బాబు కాళ్ల దగ్గర పెట్టడానికి ఒప్పుకోలేదు. అందుకే పోలింగ్ లో స్వభిమానం అడ్డొచ్చి కారుకే గుద్దారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.

తాజాగా తెలుగులోని పత్రికాధినేత మాత్రం జాతీయ మీడియా చెప్పిన అన్ని ఎగ్జిట్ పోల్స్ ను పక్కనపెట్టి.. కేవలం తడబడి..పొరబడి ప్లస్ ఆర్ మైనస్ అంటూ తన సర్వేను గందరగోళంగా చెప్పిన లగడపాటికి విశ్వసనీయతను అంటగట్టి మళ్లీ ప్రజా ఫ్రంట్ గెలుస్తుందంటూ కథనాలు వండివారుస్తున్నారు. మరి అందరూ ఒప్పుకున్న టీఆర్ ఎస్ గెలుపును ఈయన మాత్రం జీర్ణించుకోవడం లేదు. 11న ఫలితాలు వెల్లడించాకైనా ఈయన టీఆర్ ఎస్ విజయాన్ని ఒప్పుకుంటారో.. ఇదంతా తూచ్ అంటాడో చూడాలి మరి..