Begin typing your search above and press return to search.
రేప్ చేస్తా.. చంపేస్తామని బెదిరించినోళ్లలో ఒకడు పాక్ నుంచి వచ్చాడు
By: Tupaki Desk | 20 July 2022 5:51 AM GMTగడిచిన కొద్ది రోజులుగా వార్తల్లో ప్రముఖంగా కనిపించటమే కాదు.. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైన బీజేపీ బహిష్క్రత నేత నూపుర్ శర్మకు సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఆమె మహ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ తెలిసిందే. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు పెరిగాయి. ఆమెను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరిస్తే.. తనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదైన కేసుల్ని ఒకే చోట చేర్చి.. విచారించాల్సిందిగా ఆమె కోరితే దానిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను దారుణంగా రేప్ చేస్తామని.. హత్య చేస్తామంటూ పలువురు ఆమెను బెదిరిస్తున్నారు. ఇలాంటి వేళ.. ఆమె సుప్రీంను మరోసారి ఆశ్రయించారు. దేశ వ్యాప్తంగా తనపై పెట్టిన కేసుల్ని ఒకేబెంచ్ మీద విచారిస్తే.. తనకు భద్రతాపరమైన ఇబ్బందులు తప్పుతాయని విన్నవించారు. ఇదిలా ఉండగా.. ఆమె సందేహాలు నిజమని.. ఆమెనురేప్ చేస్తాం.. హత్య చేస్తామంటూ దారుణంగా బెదిరిస్తున్న వారు చాలామందే ఉన్నారన్న విషయం అర్థమయ్యే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన రిజ్వాన్ అష్రప్ అనే ఒకడు ఆమెను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చిన వైనం కలకలాన్ని రేపుతోంది.
రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా హిందూమల్ కోట్ వద్ద సరిహద్దు దాటి అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడ్ని సరిహద్దు గస్తీ దళం అదుపులోకి తీసుకుంది. దీనికి సంబంధించిన పలు విచారణ సంస్థలు అతన్ని విచారించాయి. ఈ సందర్భంగా అతని సంచిలో పదకొండు అంగుళాల కత్తి.. మతపరమైన సాహిత్యం.. మ్యాపులు.. ఆహార పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు.
నూపుర్ శర్మను చంపేందుకు వీలుగా సరిహద్దు దాటినట్లుగా పేర్కొన్నారు.
అజ్మీర్ షరీఫ్ కు వెళ్లిన తర్వాత తన కుట్రను అమలు చేసేందుకు వీలుగా ప్లాన్ చేసుకోవాలని తాను భావించినట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అతన్ని రిమాండ్ తరలించిన అధికారులు.. నూపుర్ శర్మను హత్య చేయటానికి భారత్ లో అతనికి ఎవరు సహకారం అందిస్తారన్న విషయాన్ని అతని గురించి తెలుసుకునేందుకు వీలుగా అతన్ని రిమాండ్ కు తీసుకొని విచారించనున్నారు.
ఇందుకు కోర్టు సైతం అనుమతించటంతో.. కుట్రకు సంబంధించిన వివరాలు త్వరలో బయటకు రానున్నట్లుగా భావిస్తున్నారు. మరోవైపు.. నూపుర్ శర్మచెప్పినట్లుగా ఆమెను హత్య చేయటానికి పలువురు ప్రయత్నిస్తున్నారన్న విషయం తాజా ఉదంతంతో తేలినందున.. ఆమెకు మరింత భద్రతను కల్పించి.. ఆమె కోరినట్లుగా దేశ వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్ని ఒకే చోటుకు చేర్చి విచారించేలా చూడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.