Begin typing your search above and press return to search.
ఐదుగురిలో ఒకరికి వైరస్ ముప్పు ఉందట !
By: Tupaki Desk | 17 Jun 2020 7:50 AM GMTప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్‌పై రకరకాల అధ్యయనాలు, పరిశోధనలు, అంచనాలు, హెచ్చరికలు ఉన్నాయి. కొన్నిదేశాల కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ మాయదారి రోగం మరింత తీవ్రరూపం దాల్చనుందని తాజా పరిశోధన తేల్చింది. ప్రపంచ జనాభాలో ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఈ వైరస్ తీవ్ర స్థాయిలో సోకే ప్రమాదం ఉందని తమ అధ్యయనంలో తేలింది అని లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు.
ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను ప్రఖ్యాత లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మ్యాగజైన్ ప్రచురించగా.. ప్రపంచ జనాభాలో 22 శాతం మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, వారికి ఈ వైరస్ సోకితే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ లెక్కన దాదాపుగా 170 కోట్ల మంది వైరస్ ముప్పులో ఉన్నారని ఆ అధ్యయనం విశ్లేషించింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ వైరస్‌తో తీవ్రప్రమాదమే ఉందని హెచ్చరిస్తోంది లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధన.
కాగా , ప్రస్తుతం భారత దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 354065కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య... 11903కి చేరింది. మరణాల రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగింది.