Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్ లో ప్రతీ ఆరుగురిలో ఒకరు భారతీయులే

By:  Tupaki Desk   |   10 Nov 2022 12:30 AM GMT
ఇంగ్లండ్ లో ప్రతీ ఆరుగురిలో ఒకరు భారతీయులే
X
ఇంగ్లండ్ దేశంలో ప్రవాస భారతీయుల సంఖ్య పెరిగిపోతోంది. ఎంతలా అంటే అక్కడి ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారే. అందులో భారతీయులే అత్యధికం అని తేలింది. గత సంవత్సరం ఇంగ్లండ్ , వేల్స్‌లో నివసిస్తున్న ఆరుగురిలో ఒకరు విదేశీయులేనని తేలింది. దేశంలో 2021 జనాభా లెక్కల ఆధారంగా తాజా గణాంకాల ప్రకారం.. భారతీయులు 1.5 శాతం ఇంగ్లండ్ నివాసితులతో అతిపెద్ద భాగంగా ఉన్నారు.

యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) ప్రకారం.. బ్రిటన్ దేశంలో గత సంవత్సరం యూకే వెలుపల జన్మించిన 9,20,000 మందితో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఆ తర్వాత పోలాండ్ 743,000 మంది వాసులు 1.2 శాతం మంది నివసిస్తున్నారు. పాకిస్తాన్ 624,000 (1 శాతం) మంది బ్రిటన్ లో ఉంటున్నారు .

"ఇంగ్లండ్ - వేల్స్‌లోని సాధారణ నివాసితులలో ఆరుగురిలో ఒకరు యూకే వెలుపల జన్మించారు. 2011 నుంచి 2.5 మిలియన్ల పెరుగుదల కనిపించింది. 7.5 మిలియన్ల (13.4 శాతం) నుంచి 10 మిలియన్లకు (16.8 శాతం)" మంది ఇతర దేశస్థుల సంఖ్య పెరిగిందని ఓఎన్ఎష్ ఒక ప్రకటనలో తెలిపింది.

గత 10 సంవత్సరాల క్రితం నుండి ఇంగ్లాండ్ -వేల్స్‌కు ఈ మూడు దేశాలు భారతదేశం, పోలాండ్ , పాకిస్తాన్‌ వాసులు అత్యధికంగా తరలివచ్చి సెటిల్ అయ్యారు. అన్ని వర్గాలలో వీరి జనాభా ఎక్కువగా ఉంది. భారతదేశం 694,000 నుండి, పోలాండ్ 579,000 నుండి మరియు పాకిస్తాన్ 2011లో 482,000 మంది ఉన్నారు.

2021లో ఇంగ్లండ్ -వేల్స్‌లోని నివాసితులు కలిగి ఉన్న యూకేయేతర పాస్‌పోర్ట్‌లలో పోలిష్, రొమేనియన్ , ఇండియన్ లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. జనాభా గణన డేటా చూపిస్తుంది.

గడిచిన పదేళ్లలో బ్రిటన్ కు వలసవచ్చిన వారి జాబితాలో మాత్రం రోమేనియా తొలి స్తానంలో ఉంది. 2011లో వారి సంఖ్య 80 వేలు ఉండగా.. ప్రస్తుతం 5 లక్షల 39వేలకు చేరింది. రోమేనియా నుంచి పని కోసం వచ్చే వారి పౌరులపై ఉన్న ఆంక్షలను 2014లో ఎత్తేసిన తర్వాత ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇక బ్రిటన్ కు ఐర్లాండ్, బంగ్లాదేశ్, నైజీరియా, జర్మనీ, దక్షిణాప్రికా నుంచి బ్రిటన్ కు వలసలు పెరగగా.. అమెరికా, జమైకా నుంచి తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.