Begin typing your search above and press return to search.
గవర్నమెంట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్ , ఒకరు మృతి !
By: Tupaki Desk | 31 Aug 2020 12:10 PM GMTతెలంగాణ జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయింది. చిన్న పిల్లల వార్డులో అకస్మాత్తుగా ఆక్సిజన్ సిలిండర్ లీక్ కావడంతో భయాందోళనలకు గురైనా రోగులు ఒక్కసారిగా బయటకి పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక వెంటిలేటర్ పై ఉన్న కృష్ణయ్య అనే వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆత్మకూరుకు చెందిన కృష్ణయ్య ఆయాసంతో నిన్ననే హాస్పిటల్ లో చేరాడు. దీంతో అతన్ని వెంటలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇంతలోనే ఆక్సిజన్ లీక్ అయిన ఘటన జరగడంతో.. వెంటిలేటర్‌పై ఉన్న కృష్ణయ్యను బయటకు తీసుకొచ్చారు. దీంతో కృష్ణయ్య ఊపిరి అందక మృతి చెందినట్టు సమాచారం. చాలా మంది రోగులు వెంటిలేటర్ తో బయటకు వచ్చి చెట్ల కిందా కూర్చున్నారు.
ఆసుపత్రిలోని రోగుల కథనం మేరకు..గద్వాల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలోని చిన్న పిల్లల వార్డులో అకస్మాత్తుగా ఆక్సిజన్ సిలిండర్ లో పొగలు రావటంతో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడి చేరుకుని ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లారు. సంఘటన స్థలాని సూపరింటెండెంట్ డాక్టర్ శోభారాణి, గద్వాల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పరిశీలించారు. గందరగోళం తర్వాత రోగులు తమ వార్డుల్లోకి వెళ్లి చికిత్స పొందుతున్నారు.