Begin typing your search above and press return to search.
వైరల్ వీడియోతో తేలింది టిక్ టాక్ ప్రాణం తీసిందని!
By: Tupaki Desk | 12 July 2019 5:08 AM GMTసరదాగా టైంపాస్ చేసే టిక్ టాక్ తో ఒకరి ప్రాణం పోయింది. వినోదాన్ని అందించే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. అది వ్యసనంగా మారటంతోనే పెద్ద సమస్యగా మారింది. సెల్ఫీల మోజుతో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రాణాలు పోగొట్టుకున్న వైనం తెలిసిందే. ఇప్పుడు అదే తీరులో టిక్ టాక్ ప్రాణాలు తీసేస్తోంది.
టిక్ టాక్ యాప్ లో తమ వీడియోల్ని పోస్ట్ చేయటం.. వాటితో పాపులర్ అయ్యే అవకాశం ఉండటంతో బుర్రకు తట్టిన పిచ్చి పనుల్ని చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజా ఉదంతం దీనికో నిదర్శనంగా చెప్పాలి. హైదరాబాద్ మహానగర శివారులోని దూలపల్లి చెరువుకు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు నరసింహ.
చెరువులో సరదా విన్యాసాలు చేస్తూ.. వాటిని టిక్ టాక్ లో పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. టిక్ టాక్ వీడియో సరదాగా పడి తాను మునిగిపోతున్న వైనాన్ని గుర్తించలేదు. చివరకు చేజారిన తర్వాత నరసింహ జాడ కోసం అతడి స్నేహితుడు విపరీతంగా ప్రయత్నించి.. స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
సరదా కోసం టిక్ టాక్ వీడియో తయారు చేయటానికి వెళ్లిన నరసింహ చెరువులో మునిగిన వైనం తొలుత ప్రమాదంలో మరణించినట్లుగా భావించారు. అయితే.. టిక్ టాక్ లో వీడియో వైరల్ అయ్యాక కానీ.. నరసింహా ఎందుకు చనిపోయారో అర్థమయ్యేలా చేసింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన నరసింహ.. సెలవుల్లో స్నేహితులతో సరదాగా గడిపేందుకు హైదరాబాద్ శివారులో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు.
చెరువులో సాహసం చేస్తూ టిక్ టాక్ లో వీడియోను పోస్ట్ చేయాలన్నది నరసింహ ప్లాన్. అది కాస్తా రివర్స్ కావటంతో ప్రాణం పోయింది. చెరువులో సాహసం చేయాలనుకున్న నరసింహకు ఈత కూడా రాదని చెబుతున్నారు. కేవలం టిక్ టాక్ మోజుతోనే అతడీ సాహసానికి ఒడిగట్టినట్లుగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతుల కంటే ప్రాణం మరింత విలువైనదన్నది మర్చిపోకూడదు.