Begin typing your search above and press return to search.
గంటలో ఇంటికి ఫోన్.. లేదంటే ఫ్రీ అంట
By: Tupaki Desk | 9 Oct 2015 6:01 AM GMTకాలం మారిపోయింది. వేగానికి అమితమైన ప్రాధాన్యత పెరుగుతోంది. చేతిలో డబ్బులు ఉండాలే కానీ కొండ మీద కోతి కూడా కిందిగి దిగి వచ్చి సర్వీసు రోజులు దగ్గరకు వచ్చేశాయి. ఈ కామర్స్ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో.. మరింత మెరుగైన సేవలు అందించటం ద్వారా మనసును దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి వివిధ కంపెనీలు.
ఇందులో భాగంగా తాజాగా ఓ భారీ ఆఫర్ ను ప్రకటించింది వన్ ప్లస్ వన్ మొబైల్ కంపెనీ. తన తాజా ఉత్పత్తిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన గంటలోపు ఇంటికి డెలివరీ చేస్తామని.. అలా చేయలేని పక్షంలో ఫోన్ ను ఉచితంగా ఇచ్చేస్తామని ఊరిస్తోంది. గతంలో ఇలాంటి ఫీట్ నే పిజ్జాకు అమలు చేసే వారు. తాజాగా పెరిగిన పోటీ నేపథ్యంలో మిగిలిన ఈ కామర్స్ సంస్థలు ఆన్ లైన్ లో బుక్ చేసిన వస్తువుల్ని 24 నుంచి 48 గంటల్లో డెలివరీ చేయటం తెలిసిందే.
అందుకు భిన్నంగా కేవలం గంట అంటే గంట వ్యవధిలోనే ఫోన్ ను డెలివరీ చేస్తామని చెబుతోంది. అయితే.. ఈ ఆఫర్ ప్రస్తుతం బెంగళూరు మహానగరంలోనే అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు ఇలాంటి పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్న కంపెనీ.. ప్రస్తుతం మాత్రం గార్డెన్ సిటీలో మాత్రమే వన్ అవర్ డెలివరీ ఆఫర్ ను ప్రకటించింది.
అయితే.. ఇందుకోసం మరికొన్ని పనులు వినియోగదారుడు చేయాల్సి ఉంటుంది. బ్లోహార్న్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని దాని ద్వారా ఫోన్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ పరిమిత ఆఫర్ అక్టోబరు 8 నుంచి 10 లోపు మాత్రమే ఇస్తున్నారు. ఏది ఏమైనా.. రానున్న రోజుల్లో సేవలు మరింత వేగాన్ని సంతరించుకోనున్నాయన్న విషయం తాజా ఆఫర్ చెప్పకనే చెప్పేసినట్లైందని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.