Begin typing your search above and press return to search.
అమరావతికి ఒక రూల్.. జిల్లాలకు మరో రూలా? టీడీపీ ఫైర్
By: Tupaki Desk | 28 Jan 2022 9:31 AM GMTరాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన కొత్త జిల్లాలపై అధికార పార్టీ నేతలు కూడా పలు చోట్ల ఆందోళన లు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇదే విషయంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడాతీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు జిల్లాల విషయంలో అనుసరిస్తున్న విధానానికి పొంతన లేదని పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం, జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ఆయన విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావ తి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలను మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని నిలదీశారు. ప్రస్తుతం పలు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. దీనిపై కొందరు వైసీపీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలు సమీపంలో ఉంటే.. మరికొన్నిచోట్ల సుదూరంగా ఉంటున్నాయి. ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి ఒంగోలుకు దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంది. మార్కాపురం జిల్లాగా ఏర్పాటైతే ఎక్కువగా లబ్ది పొందేది యర్రగొండపాలెం వాసులేనని ఇక్కడి వారు చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం సమదూరంలో ఉండాలనే లక్ష్యంతోనే ఏర్పాటు చేశామని చెబుతోంది. ఇక, ప్రకాశం జిల్లాలోని కందుకూరును రెవెన్యూ డివిజన్ గా కొనసాగించాలని కందుకూరు ప్రజలు డిమాండ్లు చేస్తున్నారు.
ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కార్నర్ చేశారు. అందరికీ అందుబాటులో ఉన్న అమరావతిని కాదని.. విశాఖను ఎంపిక చేశారని.. అయితే.. జిల్లాల ఏర్పాటులో మాత్రం దీనికి విరుద్ధంగా `సమదూరం` అనే మాటలను వినియోగిస్తున్నారని.. ఇది రాజకీయంగా ద్వంద్వ నీతి కాదా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని అంటున్నారు. డైవర్షన్ రాజకీయాలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందన్నారు. శాస్త్రీయ పద్ధతి లేకుండా వైసీపీ నేతలు స్వార్థ ప్రయోజనాలను చూసుకుని జిల్లాలను విభజించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు.
గుడివాడలో జరిగిన క్యాసినో భాగోతాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఉద్యోగుల సమస్యలు, క్యాసినో వ్యవహారం నుంచి పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చి ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని జీవీ ఆంజనేయులు విమర్శలు చేశారు. జనగణన పూర్తయ్యే వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు వద్దు అని కేంద్రం స్పష్టం చేసినా ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేశారన్నారు. జిల్లా పేర్లు పెట్టడంలోనూ రాజకీయ స్వార్థం చూసుకున్నారన్నారు.