Begin typing your search above and press return to search.
అవును.. అక్కడ మీల్స్ రూపాయే
By: Tupaki Desk | 14 Sep 2015 9:48 AM GMTతమిళనాడులోని ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మ క్యాంటిన్ లో ఇడ్లీ రూపాయి. దీనికే చాలామంది ఆశ్చర్యపోతుంటారు. నిర్వహణ సాధ్యమేనా అని ప్రశ్నిస్తారు. చాలామంది అవెలా నడుస్తున్నాయో అని వచ్చి పరిశీలించి వెళుతుంటారు. కానీ.. ఆచరణలో మాత్రం చాలామంది చేయలేరు. రూపాయికి ఇడ్లీకి ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో రూపాయికి మీల్స్ ఇవ్వటం సాధ్యమేనా?
సమస్యే లేదు. సాధ్యమే కాదని అంటారు కానీ.. మనసుంటే మార్గం ఉందని నిరూపించారు కొంతమంది యువకులు. సమాజానికి ఏదైనా చేయాలని భావించిన కర్ణాటకకు చెందిన మహవీర్ యూత్ ఫౌండేషన్ సభ్యులు ఐదేళ్ల క్రితం హుబ్బాళి క్యాంటీన్ పేరుతో రోటీ ఘర్ ను స్టార్ట్ చేశారు. కేవలం రూపాయి చెల్లిస్తే చాలు.. కడుపు నిండా భోజనం పెట్టి పంపటమే కాదు.. మళ్లీ మళ్లీ రావాలని అనిపించేలా చేస్తారు. ఒక తీపి గురుతుగా మిగిలిపోయేలా చేస్తారు.
రూపాయికి చిన్న చాక్లెట్ కూడా సరిగా రాని రోజుల్లో అదే రూపాయికి ఇస్తున్న భోజనం మెనూ చూస్తే షాక్ కావాల్సిందే. రూపాయి మీల్స్ మెనూలో రోటీలు.. అన్నం.. కూర.. పప్పు.. సాంబార్.. పెరుగుతో పాటు ఒక స్వీటు ఇచ్చి స్వీట్ షాక్ ఇచ్చేస్తారు.
అంతేకాదు.. ఆకలి అని వెళ్లే వారికి కడుపు నిండా భోజనం పెట్టే ఈ రోటీ ఘర్.. చేతికి డబ్బులు తీసుకోరు. అక్కడున్న హుండీలో వేస్తే సరిపోతుంది. సెల్ప్ సర్వీసు అయిన ఈ క్యాంటీన్ కు ఎలాంటి వారు వస్తారన్న డౌట్ అక్కర్లేదు. రూపాయి భోజనం అంటే పరిసరాలు.. పరిశుభ్రత ఎలా ఉంటుందన్న సందేహం కూడా అక్కర్లేదు. పేదవాడి వరకూ డబ్బులున్న వారు సైతం తరచూ ఈ క్యాంటీన్ కు వచ్చి తినేసి వెళుతుంటారు.
రూపాయి భోజనం అయినా.. వారి ఇచ్చిన సర్వీసు చూసి కడుపునిండిపోయిన చాలామంది చేతికి తోచినంత హుండీలో వేసి వెళ్లిపోతుంటారు. ఈ క్యాంటీన్ ప్రత్యేకత ఏమంటే.. ఫుడ్ అయిపోయిన సమయంలో ఎవరైనా వస్తే.. అప్పటికప్పుడు వేడి..వేడిగా వండి వడ్డిస్తారు కూడా. రూపాయికి భోజనం పెడుతున్న ఈ క్యాంటిన్ ఆర్థిక పరిస్థితి ఏమిటన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా.. బ్రహ్మాండంగా నడుస్తోంది. చేయాలన్న సంకల్పం.. మంచి మనసు ఉండాలే కానీ.. అసాధ్యం కానిదేదీ లేదని నిరూపిస్తుంది ఈ క్యాంటీన్. గ్రేట్ కదూ.