Begin typing your search above and press return to search.
రూపాయి నోటు ప్రింట్ చేయాలంటే..?
By: Tupaki Desk | 4 Jan 2016 10:47 AM GMTఒక చిన్న ప్రశ్న..? గతంలో కనిపించి.. మధ్యలో మాయమై.. ఈ మధ్యనే తళుక్కుమంటున్న రూపాయి నోటును అచ్చేయటానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రశ్న సింఫుల్ గా ఉన్నా.. సమాధానం చెప్పే వాళ్లు చాలా తక్కువ. రూపాయి విలువ ఉన్న నోటును ప్రింట్చేసేందుకు అయ్యే ఖర్చు లెక్క వింటే కాస్త ఆశ్చర్యం కలగకమానదు.
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం రూపాయి నోట్లు జేబుల్లో తరచూ కనిపించేవి. కానీ.. ఆ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో రూపాయి నోట్ల వినియోగం తగ్గిపోవటమే కాదు.. కనిపించటం మానేశాయి కూడా. కొంతమంది దగ్గర మాత్రమే కనిపించే రూపాయి నోట్లు చలామణిలో లేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే రూపాయి నోట్లను తిరిగి ముద్రించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. 2014.. 2015 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5 కోట్ల రూపాయి నోట్లను అచ్చేశారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో 15.5 కోట్ల రూపాయి నోట్లను అచ్చేసినట్లు తేలింది.
మరి.. రూపాయి నోటు అచ్చేయటానికి అయ్యే ఖర్చు విషయానికి వస్తే.. ఇదో దండగమారి వ్యవహారంగా చెప్పాలి. ఎందుకంటే.. అప్పుడెప్పుడో1994లోనూ రూపాయి నోటు అచ్చేయటానికి ఒక్కోదానికి రూ.1.48 ఖర్చు అయినట్లు తేల్చారు. తాజా పరిస్థితుల్లో ఈ ఖర్చు రెండింతలు కావటం ఖాయమని.. మరికాస్త పెరిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. రూపాయి నోటు అచ్చేయటానికి రూ.3 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? ఇంత నష్టం మూటగట్టుకునే రూపాయి నోట్లను ఎందుకు ప్రింట్ చేస్తున్నట్లు..?