Begin typing your search above and press return to search.
ఢిల్లీ ఒకవైపు చలి.. మరోవైపు మంటలు!
By: Tupaki Desk | 18 Dec 2019 4:26 AM GMTదేశ రాజధాని ఢిల్లీ పై చలిపులి పంజా విసురుతూ ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు 12.2 డిగ్రీల స్థాయికి పడిపోయాయి. చలి అత్యంత తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ఢిల్లీ కూడా ఒకటి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అక్కడ పడిపోతూ ఉంటుంది. గాలి మందంగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా చలి పులి విజృంభిస్తూ ఉంది.
ఒకవైపు చలి అలా ఉంటే.. మరోవైపు ఢిల్లీలో పౌరసత్వం చట్టం మంటలు గట్టిగానే అల్లుకుంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం, పశ్చిమ బెంగాల్ కు పరిమితం అయిన నిరసనలు ఢిల్లీని తాకాయి. అక్కడ భారీ ర్యాలీ ఒకటి హింసాత్మకంగా మారింది.
పౌరసత్వం చట్టం సవరణలను వ్యతిరేకిస్తూ మూడు వేల మందితో సాగిన ఒక ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని వారు ఆందోళన కారులను ఆపారు. దీంతో నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళన కారులు దాడులకు తెగబడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.
ఇలా ఈశాన్య ఢిల్లీ వేడెక్కింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టాయి. ఆ ర్యాలీలో సోనియాగాంధీతో సహా ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు,
సమాజ్ వాదీ పార్టీ తదితర పార్టీలు ఆ నిరసనల్లో పాల్గొన్నాయి. అయితే ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని ప్రకటించింది. ఇలా శీతాకాలంలో ఢిల్లీలో రాజకీయం మంటలు పుట్టించేస్తోంది