Begin typing your search above and press return to search.
యజమాని కూతురిపై వన్ సైడ్ లవ్.. కాదన్నారని తనని తాను తగలేసుకున్నాడు
By: Tupaki Desk | 27 Jun 2022 4:02 AM GMTప్రేమించటం తప్పు కాదు. కానీ.. తన ప్రేమకు ఒప్పుకు తీరాలంటూ కండీషన్ పెట్టి.. అందుకు కాదంటే చచ్చిపోతానంటూ బెదిరింపులకు దిగటానికి మించిన దరిద్రం మరొకటి ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన వన్ సైడ్ లవ్ ను ఒప్పుకొని.. ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని బలవంతం చేయటానికి మించిన ఆరాచకం మరొకటి ఉండదు. అందుకు నో చెప్పారంటూ.. తనను తాను తగలబెట్టేసుకున్న విపరీత ఉదంతం హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..ఫలక్ నామా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ విపరీత ఉదంతంలోకి వెళితే.. మైలార్ దేవుపల్లి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మహ్మద్ జమాల్ ఫలక్ నుమా అచ్చిరెడ్డి నగర్ లోని ఒక టైలరింగ్ షాపులో పని చేసేవాడు. యజమాని ఇంటికి కూరగాయలు.. ఇతరత్రా వస్తువులు ఇచ్చి రావటానికి వీలుగా జమాల్ ను తన ఇంటికి పంపేవాడుయజమాని. ఈ నేపథ్యంలో మైనర్ అయిన ఓనర్ కుమార్తెపై మనసు పారేసుకున్నాడు. వన్ సైడ్ లవ్ ను పెంచుకున్నాడు.
ఈ విషయం తెలిసిన షాపు యజమాని.. అతడ్ని నాలుగు నెలల క్రితం పని నుంచి తొలగించాడు. అయినప్పటికీ తన వన్ సైడ్ ప్రేమను వదులుకోకుండా.. రెండు నెలల క్రితం తన తల్లిని యజమాని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయాలని కోరాడు. దీంతో.. టైలర్ షాపు యజమాని ఆ ప్రపోజల్ కు నో చెప్పారు. దీంతో వారిపై కోపం పెంచుకున్న యువకుడు.. బాలిక కుటుంబీకులకు ఫోన్లు చేసి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో.. వారు అతడికి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు.
దీంతో.. తన పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పారన్న కోపంతో.. బాలిక నివిస్తున్న భవనం వద్దకు వెళ్లి.. వారుంటున్న రెండో అంతస్తుకు చేరుకున్నాడు. చేతిలో డీజిల్ బాటిల్.. ఆటోలో గ్యాస్ సిలిండర్ ను తీసుకొని.. వారింటిక వెళ్లి.. తన ఒంటి మీద డీజిల్ పోసుకొని.. గ్యాస్ రెగ్యులరేటర్ ఆన్ చేయటంతో మంటలు వెంటనే వ్యాపించాయి.
మంటల వేడికి తాళలేక.. మెట్ల మీద నుంచి పరిగెత్తుతూ.. కింద పడి తలకు గాయమై.. పడిపోయాడు. అతడ్ని బాలిక తండ్రి.. చుట్టుపక్కల వారు ఉస్మానియాకు తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది.
ఈ విపరీత ప్రేమతో ప్రాణాలు పోగొట్టుకోవటమే కాదు.. తనను నమ్ముకున్న తల్లిని ఒంటరిని చేసి పోయాడు. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సింది పోయి.. ఇలాంటి పనులు చేసి వారికి వేదన మిగల్చటమా? అన్నది చర్చగా మారింది.