Begin typing your search above and press return to search.

ట్రంప్ గండం... ఏడాది గ‌డిచింది !

By:  Tupaki Desk   |   9 Nov 2017 5:48 PM GMT
ట్రంప్ గండం... ఏడాది గ‌డిచింది !
X
అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప‌గ్గాలు చేప‌ట్టి ఏడాది గ‌డిచింది. ట్రంప్ ఏడాది ఏలుబ‌డిలో ఆయ‌న విజ‌యాలు - వైఫ‌ల్యాల‌ను అంత‌ర్జాతీయ మీడియా విశ్లేషించింది. ఈ ప్ర‌కారం స‌ద‌రు మీడియా సంస్థ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

· 7% జనాదరణతో అతితక్కువ జనామోదం పొందిన అధ్యక్షుడు

· 70 ఏళ్లలో అమెరికాలో అతి త‌క్కువ ఆద‌ర‌ణ పొందిన నాయ‌కుడు ట్రంప్ ఒక్క‌రే

·ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 2.6% ఆర్థికరంగ వృద్ధి

·స్టాండర్డ్‌ & పూర్‌ (అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌)లో 21శాతం వృద్ధి (1936తర్వాత తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల అనంతరం వరుసగా 12నెలలపాటు వృద్ధిని సాధించడం నాలుగోసారి)

·నిరుద్యోగిత గత జూలైలో 4.3%. 2001 తర్వాత ఇదే అత్యల్పం.

·తగ్గిన 43లక్షలమంది విదేశీ పర్యాటకులు. 7.4 బిలియన్‌ డాలర్ల (రూ.48వేల కోట్ల) రెవెన్యూనష్టం

·ఉగ్రవాద దాడులు/ కాల్పుల ఘటనలు : 362

·2470- అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ ట్వీట్లు (సగటున రోజుకు ఏడు)

·ట్వీట్లలో పదాల వాడకం- గ్రేట్‌(456సార్లు), ఫేక్‌ న్యూస్‌/మీడియా(167) - జాబ్స్‌(94) - ఒబామాకేర్‌(77) - హిల్లరీ (54)

·పర్యటించిన దేశాలు -13 (తాజా పర్యటనలో మరో రెండుదేశాలు కూడా), పర్యటించిన యూఎస్‌ రాష్ట్రాలు-24

·పాల్గొన్న ర్యాలీలు/ప్రదర్శనలు-18

·సంతకం చేసి చట్టాలుగా మార్చిన బిల్లులు-82 ; కార్యనిర్వాహక ఉత్తర్వులు : 50 ; పార్లమెంటు తీర్మానాలు-321

కీలక నిర్ణయాలు

·హెచ్‌-1బీ వీసాల విధానాన్ని సమీక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2018 సంవత్సరానికి హెచ్‌-1బీ వీసాలకు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఐదేండ్లలో ఇదే తొలిసారి.

·అమెరికాకు ఉత్తరకొరియా - సిరియా - చాద్‌ - యెమెన్‌ - లిబియా - సోమాలియా - ఇరాన్‌ - వెనెజులా.. 8 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు.

·ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించి విమర్శలు మూటగట్టుకున్నారు.

·యునెస్కో నుంచి కూడా అమెరికా తప్పుకోవడం ట్రంప్‌ నిర్ణయమే.

·ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌ బీఐ) చీఫ్‌ జేమ్స్‌ కామేను ట్రంప్‌ తొలిగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలన్న ట్రంప్‌ అభ్యర్థనను తిరస్కరించినందుకే తనపై చర్య తీసుకున్నారని కామే ఆరోపించడం సంచలనం సృష్టించింది.

·మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మాణానికి సిద్ధమైన ట్రంప్‌.. ఇంతవరకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. మెక్సికోనే ఆ నిధులు భరిస్తుందని ఆయన ప్రకటించగా, తమకేమీ సంబంధంలేదని మెక్సికో స్పష్టంచేసింది.

·ఏడాదికాలంలో ట్రంప్‌ 207మందిని వివిధ పోస్టులకు నామినేట్‌ చేశారు. అయితే ఆయన విధానాలు నచ్చక చాలామంది సలహాదారులు - వైట్‌ హౌస్‌ సిబ్బంది పదవినుంచి తప్పుకున్నారు.

·ఉత్తరకొరియాతో ఢీఅంటే ఢీ అనే విధానం. దీనివల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిస్థాయిలో క్షీణించాయి.