Begin typing your search above and press return to search.
జనతా కర్ఫ్యూకు ఏడాది .. మళ్లీ కరోనా విజృంభణ , లాక్ డౌన్ తప్పదా !
By: Tupaki Desk | 22 March 2021 5:30 AM GMT2020 మార్చి 22 న భారతదేశంలోని ప్రతి ఒక్కరూ కూడా జనతా కర్ఫ్యూని పాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకి స్పందించి ప్రజలంతా ఇళ్లల్లోనే ఉన్నారు. స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు సహా అన్నీ మూడపడ్డాయి. మార్చి 22న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూని పాటించాలని మార్చి 19న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో అందరూ తూచా తప్పకూండా పాటించారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి.. 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం లేదా పళ్లేలపై శబ్ధం చేయాలని చెప్పారు. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపాలని సూచించారు.
ప్రధాని మోదీ చెప్పినట్లే సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులంతా బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. ప్లేట్‌లపై శబ్దాలు చేశారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభణతో కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 24న ప్రజలను ఉద్దేశించి ప్రకటించిన ప్రధాని మోదీ.. మార్చి 15 నుంచి 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించాలని ప్రకటించారు. ఆ తర్వాత కూడా కరోనా కేసులు భారీగా పెరగడంతో లాక్ డౌన్ పొడిగిస్తూ వచ్చారు. లాక్ డౌన్ తో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి. అత్యవసర సేవలు తప్ప అన్నీ నిలిచిపోయాయి. రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వలస కార్మికులు తాము ఉన్న ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారు. కొందరైతే ప్రాణాలకు తెగించి సొంతూళ్లకు కాలినడకనే కొన్ని వందల కిలోమీటర్లు నడిచేవెళ్లారు. ఈ క్రమంలో ఎంతో మంది మరణించారు.
లాక్ డౌన్ తో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. దీనితో ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. రెడ్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వ్యాక్సిన్ కూడా రావడంతో ప్రజల్లో ధైర్యం పెరిగింది. ఇక కరోనా మహమ్మారి మన జీవితాల్లో నుండి వెళ్ళిపోయింది అని అనుకున్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెంకడ్ వేవ్ తో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు కరోనాను పూర్తిగా మర్చిపోయి, కొన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించడంలేదు. భౌతిక దూరం అస్సలు పాటించడం లేదు. ఈ క్రమంలోనే కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్, గుజరాత్ లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దాంతో పలు నగరాల్లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తు వస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే నాగ్ పూర్ సహా పలు నగరాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నాగ్ పూర్‌లో మార్చి 31 వరకు ఆంక్షలు పొడిగించారు. పుణెలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోంది. మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హోటళ్లు, బార్లు, షాపింగ్ మాల్స్ మూసివేస్తున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరాలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు. రాజస్థాన్ లోని అజ్మీర్, భిల్వారా, జైపూర్, జోధ్ పూర్, కోటా, ఉదయ్ పూర్, సగ్వారా, కుశల్ గఢ్ నగరాల్లో మార్చి 22 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్, ఇండోర్, భోపాల్ లో నేడు లాక్ డౌన్ విధించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రతి ఆదివారం ఈ మూడు నగరాల్లో లాక్ డౌన్ ఉంటుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
ఇదిలా ఉంటే .. మన దేశంలో గడిచిన 24 గంటల్లో 46,951 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో 212 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని 21,180 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రికవరీ కంటే కొత్త కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదువుతన్నాయి. తాజా కేసులతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,16,46,081కి చేరింది. వీరిలో కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు 1,11,51,468 మంది కోలుకున్నారు. 1,59,967 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 3,34,646 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 95.8 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.4గా ఉంది. కరోనా సెకండ్ వేవ్ దేశంలో మొదలైనట్టు కొందరు నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని , కరోనా నియమాలు పాటించాలని కోరారు.