Begin typing your search above and press return to search.
ఆనందయ్య కరోనా మందుపై కొనసాగుతున్న రచ్చ!
By: Tupaki Desk | 22 May 2021 10:00 AM GMTనెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాపై పనిచేస్తోందన్న ప్రచారం సాగడంతో ఇది సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వం స్వయంగా స్పందించి ఈ మందుపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో పరిశోధన చేయిస్తోంది. ఈ మందు అసలు కరోనాకు పనిచేస్తుందా? లేదా అన్నది వారు తేల్చనున్నారు. ఈలోగా పెద్ద ఎత్తున కృష్ణపట్నంకు వస్తున్న రోగులను పోలీసులు నియంత్రిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మందు పంపిణీని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది.
అయితే ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం ఏపీలో డిమాండ్ అధికమైంది. చాలా కరోనా బాధితులు కళ్లలో పసరు వేసిన కొద్దిసేపటికే బాగు అయినట్టు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇటీవల ఓ హెడ్మాస్టర్ కరోనాతో బాధపడుతూ ఆనందయ్య ఆయుర్వేద మందును తీసుకున్నాడు. రెండు నిమిషాల్లోనే కోలుకున్నానని వీడియోలో చెప్పాడు అది వైరల్ గా మారింది. 'నాకు అద్భుతం జరిగింది. కొన్ని నిమిషాల్లోనే నేను బాగు అయ్యాను' అని హెడ్మాస్టర్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఆనందయ్య ఆయుర్వేద మందుకోసం జనం ఎగబడేలా చేసింది.
అయితే తాజాగా సదురు హెడ్మాస్టర్ కు సంబంధించిన మరో వీడియోను హేతువాది , వివాదాస్పద బాబు గోగినేని షేర్ చేశాడు. ఆయుర్వేద మందు తీసుకున్న హెడ్మాస్టర్ పరిస్థితి ఇప్పుడు అద్వానంగా తయారైందని.. ఆయన సీరియస్ గా ఉన్నాడని వీడియోలో చూపించాడు. ఇంకా ఇలా ఆకు పసర్లతో ఎంత మంది ప్రాణాలను ముప్పులోకి నెట్టారురా మూఢులారా? హౌలేగాళ్లారా.. అంటూ బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బాబు గోగినేని ఫేస్ బుక్ లో హెడ్మాస్టర్ వీడియో షేర్ చేసి కామెంట్ చేశాడు. 'కళ్లలో మందు వేయగానే తేరుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్మాస్టర్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందని.. కళ్లలో పసు వేస్తే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి హౌలేగాళ్లారా?' అంటూ తీవ్ర పదజాలంతో బాబు గోగినేని ఏకిపారేశారు. ఆనందయ్య దుకాణం మూసివేయాలంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
బాబు గోగినేని షేర్ చేసిన వీడియోలో సదురు హెడ్మాస్టర్ ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గాయని.. సీరియస్ గా ఉన్నాడని అర్థమవుతోంది. అయితే ఆ వీడియో కరోనా సోకడానికి ముందు తీసిందా? లేక ప్రస్తుతం ఆయుర్వేద మందు తీసుకున్నాక ఇలా అయ్యిందా? అన్నది నిగ్గు తేలాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు గోగినేని వీడియోను గుడ్డిగా నమ్మే పరిస్థితులు లేవంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఆయుర్వేద మందు తీసుకొని 2 నిమిషాల్లో బాగైనట్టు చెబుతున్న హెడ్మాస్టర్ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో అసలైనదా? లేక మార్ఫింగ్ చేసిందా? కరోనాకు ముందు తీసిందా? తర్వాత తీసిందా? అన్న వివరాలు లేవు. దీన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో కొందరు ఆయుర్వేద మందుకు మద్దతుగా.. బాబు గోగినేని లాంటి హేతువాదులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
మొత్తంగా ఇప్పుడు ఏపీలో ఆనందయ్య కరోనా మందు సాక్షిగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్ దీనిపై పరిశోధిస్తాయి. అప్పటివరకు మందు పంపిణీని ఏపీలో ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మందు గురించి నిజానిజాలు తెలిసే వరకు ఇలాంటి వాదనలు సోషల్ మీడియాలో సాగుతూనే ఉంటాయి. ఏది నిజం.? ఏదీ అబద్ధం అన్నది తేలాల్సి ఉంది.