Begin typing your search above and press return to search.

వంటింటి కరోనా ఔషధం.. ఉల్లి చాయ్ తో మహమ్మారికి మటాష్!

By:  Tupaki Desk   |   27 May 2021 1:30 AM GMT
వంటింటి కరోనా ఔషధం.. ఉల్లి చాయ్ తో మహమ్మారికి మటాష్!
X
మనం తీసుకునే ఆహారంలో వాడే పదార్థాలన్నీ వేటికవే ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయి. మనకి తెలియని ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. వైద్యం అందుబాటులోకి రాకముందు మన పూర్వీకులు ఇంట్లో ఉండే పదార్థాలతో వ్యాధులను నయం చేసే వాళ్లు. అలాంటి కోవకు చెందిన పదార్థాల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? అంతేకాదు ఉల్లిపాయతో తయారు చేసిన చాయ్ తాగితే కరోనాను మన దరి చేరనీయదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఔషధాల ఉల్లి చాయ్
ఉల్లిలో ఉండే ఔషధ గుణాల వల్లే ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. మన ఆహారంలో ఉల్లిపాయను ఫ్రై చేసుకోవడం, పచ్చివి తినడం భాగమే. కానీ దీనితో చాయ్ తయారు చేయవచ్చు. ఆ తేవియంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ చాయ్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. ఈ కరోనా కాలంలో ఇది చాలా చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు.

ఎలా చేయాలి?
ఉల్లిపాయను ముక్కలుగా కోసి నీటిలో వేసి బాగా మరగనీయాలి. నీరు కాస్త రంగు మారిన తర్వాత అందులో కాస్త నిమ్మరసం, గ్రీన్ టీ బ్యాగ్ ఉంచాలి. చివర్లో కాస్తే తేనెను కలిపి తాగాలి. అలా ఉల్లి చాయ్ ను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే కరోనా వంటి మహమ్మారులను దరిచేరనీయదని అంటున్నారు.

ప్రయోజనాలు
ఉల్లి చాయ్ తో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది
జలుబు, దగ్గు, ఫ్లూను దూరం పెడుతుంది
జీర్ణక్రియ మెరగవుతుంది
శరీరంలో వాపు, నొప్పి ఉండే త్వరగా నయం చేస్తుంది
క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుంది
అధిక బరువును తగ్గిస్తుంది

పై ప్రయోజనాలతో చక్కగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ కరోనా కాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి వీలైతే మీరూ ఉల్లిపాయ చాయ్ ని భాగం చేసుకోండి. ఉల్లిలో ఉన్న పుష్కలమైన ఔషధ గుణాలను సొంతం చేసుకొండి.