Begin typing your search above and press return to search.

మారిన ట్రెండ్; దొంగల కళ్లన్నీ వాటిపైనేనా?

By:  Tupaki Desk   |   16 Sep 2015 7:32 AM GMT
మారిన ట్రెండ్;  దొంగల కళ్లన్నీ వాటిపైనేనా?
X
దొంగతనం జరిగిందంటే బంగారం.. వెండి.. నగదు.. విలువైన వస్తువులు ఉండేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరల దెబ్బతో ఇప్పుడు దొంగల టార్గెట్ మారినట్లు కనిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా జరిగిన పలు చోరీలకు ఉల్లిపాయలే లక్ష్యంగా ఉండటం గమనార్హం. తాజాగా ఇలాంటి ఉల్లిదొంగతనం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భాగ్యనగరిలోని పారిశ్రామికవాడ అయిన కాటేదాన్ లోని ఒక హోటల్ లో దొంగతనం చోటు చేసుకుంది. అక్కడ విలువైన వస్తువులు చాలానే ఉన్నాయి. కానీ.. సదరు దొంగ మాత్రం ఉల్లిపాయ బస్తా మీద మాత్రమే ఫోకస్ చేసి.. దాన్ని ఎత్తికెళ్లిపోయారు.

తమ హోటల్ లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు హోటల్ వారి మాటకు వచ్చిన పోలీసులు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఉల్లిబస్తా దొంతనం మీద విచారిస్తున్నారు. చూస్తుంటే.. విలువైన వస్తువులెన్ని ఉన్నా.. ఉల్లిపాయల మీదనే దొంగల కన్ను పడటం చూస్తుంటే.. ఉల్లిపాయల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలా? లేక.. ఉల్లిపాయల్ని పుణ్యమా అని మిగిలిన విలువైన వస్తువుల మీద కన్ను పడనందుకు సంతోషించాలా?