Begin typing your search above and press return to search.
ఫ్లైట్ జర్నీలో ఉల్లిగడ్డలు తీసుకెళ్లారు.. స్మ్గగ్లింగ్ కేసులో బుక్ చేశారు
By: Tupaki Desk | 16 Jan 2023 2:30 PM GMTమీరు చదివింది అక్షరాల నిజం. సాధారణంగా విమాన ప్రయాణంలో నిబంధనలకు విరుద్దంగా బంగారం కానీ నిషేధిత వస్తువులైన డ్రగ్స్ తో పాటు మరికొన్ని మాదకద్రవ్యాల్ని రవాణా చేయటం నేరం అవుతుంది. మరి.. ఆ జాబితాలోకి ఉల్లిగడ్డలు చేరాయా? అంటే అవునని చెబుతున్నారు.
తాజాగా విమాన ప్రయాణంలో ఉల్లిగడ్డలు తీసుకెళుతున్న ప్రయాణికుల మీద స్మగ్లింగ్ నేరాన్ని అపాదిస్తూ కేసులు నమోదు చేసిన వైనం ఆసక్తికరంగామారింది. అలా అని ఉల్లిగడ్డల్లో మరెలాంటి నిషేధిత పదార్థాలు లేవు. కానీ.. స్మగ్లింగ్ లాంటి తీవ్రమైన కేసు ఎందుకు పెట్టినట్లు? ఇలాంటి పరిస్థితి ఏ దేశంలో చోటు చేసుకుందన్న విషయంలోకి వెళితే..
ఫిలిప్పీన్స్ కు వెళ్లిన సందర్భంగా ప్రయాణికులు తమతో పాటు ఉల్లిగడ్డల్ని సంచులతో తీసుకొచ్చిన నేపథ్యంలో.. అక్కడి అధికారులు వారిపై స్మగ్లింగ్ కేసును నమోదు చేశారు. ఎందుకలా? దానికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఫిలిప్పీన్స్ లో ఉల్లిగడ్డల ధరలు ఆకాశానికి అంటుతుండటటంతో ఆ దేశస్తులు సౌదీ.. దుబాయ్ లకు వెళ్లినప్పుడు అక్కడ చౌకగా దొరుకుతున్న ఉల్లిగడ్డల్ని తమతో తెచ్చుకుంటే వారిపై తీవ్రమైన కేసులు పెడుతున్నారు.
దుబాయ్ లో కిలో ఉల్లిగడ్డలు రెండున్న దిర్హాంలు. మన రూపాయిల్లో దగ్గర దగ్గర రూ.55.50. ఫిలిప్పీన్స్ లో మాత్రం కేజీ 40 దిర్హంలు చెల్లించాల్సి వస్తోంది. అంటే.. కేజీ రూ.884 చెల్లించాల్సి వస్తోంది. దీంతో.. దుబాయ్.. సౌదీ తదితర ప్రాంతాలకు పర్యాటకులుగా వస్తున్న వారు తమతో పాటు.. పెద్ద ఎత్తున ఉల్లిగడ్డల్ని వెంట తీసుకెళుతున్నారు. ఇలా తీసుకెళ్లే వారిలో ప్రయాణికులు మాత్రమే కాదు.. విమాన సిబ్బంది కూడా ఉండటం విశేషం.
దీంతో.. పిలిఫ్పీన్స్ అధికారులు ఉల్లిగడ్డల్ని తీసుకొస్తున్న వారిపై స్మగ్లింగ్ కేసును నమోదు చేస్తున్నారు. పెరిగిన ధరల్ని తగ్గించాల్సిన ప్రభుత్వాలు.. ఆ పని చేయకుండా తమతో పాటు ఉల్లిగడ్డల్ని తెచ్చుకున్న వారిపై తీవ్రమైన కేసులు పెట్టటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. ఇతర దేశాలకు వెళుతున్న వారు.. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.