Begin typing your search above and press return to search.

న్యూ ఇయ‌ర్ వ‌చ్చేస్తోంది..మందు డోర్ డెలివ‌రీ రెడీ

By:  Tupaki Desk   |   30 Dec 2017 10:30 AM GMT
న్యూ ఇయ‌ర్ వ‌చ్చేస్తోంది..మందు డోర్ డెలివ‌రీ రెడీ
X
న్యూ ఇయ‌ర్ వ‌చ్చేస్తోంది....స్నేహితులతో కలిసి పార్టీ ప్లాన్‌ చేసుకున్నారా? చివరి నిమిషంలో మందు కోసం పరుగు పెట్టాల్సి వచ్చిందా? ఉరుకులు పరుగుల సిటీ లైఫ్‌లో అప్పుడప్పుడు అలాంటి సందర్భాలు ఎదురవడం స‌హ‌జం. కావల్సిన వస్తువుల్ని మార్కెట్‌ నుంచి తెచ్చుకునే తీరిక దొరకదు. అలా అని.. పనులన్నీ వాయిదా వేసుకోలేం కాదా? అందుకే... ఆన్‌ లైన్‌ మార్కెట్‌ ఉంది. మనకు కావల్సిన వస్తువుల్ని ఇంటి ముంగిటకు చేర్చే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు.... అన్‌ లైన్‌ మార్కెట్‌ లో రోజువారి సరుకులే కాదు.. లిక్కర్‌ కూడా ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన టెక్ సౌల‌భ్యాలు వ‌చ్చేశాయి.

ప్ర‌స్తుత కాలంలో స‌హ‌జంగానే....పార్టీ అనగానే గుర్తుకు వచ్చేది మందు. రోజంతా ఆఫీస్‌ పనిలో అలసిపోయి వచ్చాక మళ్లీ మందు కోసం పరుగు పెట్టాలంటే ఇబ్బందే అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో మీకు కావల్సిన బ్రాండ్‌ ని నేరుగా ఇంటికి చేరవేస్తామంటోంది ఆన్‌ లైన్‌ మార్కెట్‌. కావల్సిన బ్రాండ్‌ ని ముందుగానే ఆన్‌ లైన్‌ లో ఆర్డర్‌ చేస్తే చాలు, నేరుగా వచ్చి మీ ఇంటి ముందు వాలిపోతుంది. ఆన్‌ లైన్‌ లో కాదు... నగరంలో ఫోన్‌ ఆర్డర్లు తీసుకునే స్టోర్స్‌ కూడా ఉన్నాయి. కాకపోతే పరిమితమైన ప్రాంతంలో అవి సేవలందిస్తుండడం గమనార్హం.

ఇవిగో ఆ వివ‌రాలు....

-- ఆన్‌ లైన్‌ లిక్కర్‌ స్టోర్‌ ‘లిక్కర్‌ కార్ట్ట్‌’లో మీకు కావల్సిన లిక్కర్‌ ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. అన్ని విదేశీ బ్రాండ్‌ లు అందులోభాటులో ఉంటాయి. వెబ్‌ సైట్‌లో బ్రాండ్‌ - క్వాంటిటీని ఎంపిక చేసుకోవచ్చు. మందు ప్రియుల మనసుకు నచ్చిన మందు నేరుగా ఇంటి ముందు వాలిపోతుంది. 4011111111 నెంబర్‌ లో కానీ www.liquorkart.com లో ఆర్డర్‌ చేసుకోవచ్చు.

-- వైన్‌ కోసం ప్రత్యేకించిన ఆన్‌ లైన్‌ స్టోర్‌. ఈ ఆన్‌లైన్‌ సైట్‌లో అన్ని వైన్‌ బ్రాండ్స్‌ అందులోబాటులో ఉంటాయి. పార్టీలు - సెలబ్రేషన్స్‌ కోసం మీరు కావల్సిన వైన్‌ ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఫ్రీ డెలివరీ సర్వీస్‌ అందిస్తుండడం గమనార్హం.
www.thewinekart.com వెబ్‌ సైట్‌ లో ఆర్డర్‌ చేసుకోవచ్చు

-- విస్కీ ఆన్‌ లైన్‌ స్టోర్‌ ‘విస్కీ మార్ట్‌’. పెద్దమొత్తంలో విస్కీ కొనుగోలు చేయాలనుకునే వారు విస్కీమార్కెట్‌ ప్లేస్‌ నుంచి కావల్సిన బ్రాండ్‌ ని కొనుగోలు చేయవచ్చు. బ్రాండ్‌ తో పాటు బడ్జెట్‌ వారిగా ఎంచుకోవచ్చు. విదేశీ మద్యం సైతం అందుభాటులో ఉంటుంది. www.whiskymarketplace.in వెబ్‌ సైట్‌ లో ఆర్డర్‌ చేసుకోవచ్చు.

నగరంలో...

సిటీలోని అఫ్జల్‌ గంజ్‌ - దిల్‌ సుఖ్‌ నగర్‌ - జూబ్లీహిల్స్‌ - ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని పలు వైన్‌ స్టోర్స్‌ లిక్కర్‌ డోర్‌ డెలివరీ చేస్తున్నాయి. కాకపోతే నిర్ణీత టైం - నిర్ణీత ప్రాంతంలో మాత్రమే అందిస్తుడడం గమనార్హం. ఫోన్‌ ద్వారా కావల్సిన బ్రాండ్‌ - క్వాంటిటీ చెబితే నేరుగా ఇంటికే తెచ్చి ఇస్తారు. కాగా పూర్తికాలం ఇలాంటి సేవల్ని అందించడం లేదు.