Begin typing your search above and press return to search.
దారుణం : సోనూసూద్ పేరిట సాయం చేస్తామంటూ ఆన్ లైన్ మోసం
By: Tupaki Desk | 1 July 2022 8:30 AM GMTసోనూ సూద్.. ఈ బాలీవుడ్ నటుడి గురించి తెలుగులోనూ పరిచయం అక్కర్లేదు. 'వదలా బొమ్మాళీ' అంటూ అరుంధతి సినిమాలో భీకర విలనిజాన్ని పండించారు. అయితే సినిమాల్లో విలన్ అయిన ఈ నటుడు .. నిజజీవితంలో మాత్రం అసలు సిసలు హీరో అనిపించుకుంటున్నాడు. సినీ నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ వేళ దేశంలో రియల్ హీరోగా మారారు. ప్పటికే తన సేవలు కొనసాగిస్తూ దేశ ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు సోనూ సూద్ అంటే సేవకు పరమార్థంగా మారాడు. కోవిడ్19పై అతడు సాగిస్తున్న పోరాటం ప్రశంసలు అందుకుంటోంది.
బాలీవుడ్, టాలీవుడ్ తారలు కూడా చేయలేని ఎన్నో పనులను సోనూ సూద్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కరోనా సంక్షోభ సమయంలో నటుడు సోను సూద్ నిస్వార్థంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. వేలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరుకోవడానికి సహాయం చేశాడు. లాక్డౌన్ కాలంలో ముంబై నగరంలో చాలా మంది పేదలకు ఆహారం అందించాడు. ఆరోగ్య సిబ్బంది కోసం హోటల్, భోజనం సమకూర్చాడు.విదేశాల్లోని వారిని ప్రత్యేక విమానాలు వేయించి రప్పించాడు. లాక్డౌన్ పరిమితులు సడలించిన తర్వాత కూడా అతను మంచి పనిని కొనసాగిస్తున్నాడు.
అయితే కొందరు కేటుగాళ్లు దోపిడీకి సైతం సోనూసూద్ ను వాడుకున్నారు. సినీ నటుడు సోనూసూద్ పేరుతో ఓ మహిళ బ్యాంకు ఖాతాలోని నగదును ఆన్ లైన్ లో చోరీ చేసిన ఘటన రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదైంది.
నగరంలోని సీటీఆర్ఐ భాస్కర్ నగర్ ప్రాంతానికి చెందిన డి.సత్యశ్రీకి ఆరు నెలల బాబు ఉన్నాడు. చిన్నారికి దీర్ఘకాలిక వ్యాధి సోకడంతో చికిత్స నిమిత్తం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంత ఆర్థిక స్థోమత లేని ఆమె సోషల్ మీడియా ద్వారా విషయాన్ని స్నేహితులు,బంధువులకు తెలియజేసింది.
జూన్ 27న సత్యశ్రీకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. సోనూసూద్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని ఆర్థికసాయం చేస్తామని నమ్మించాడు. వెంటనే ఆమె బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలంటే వద్దని వారు వారించారు.
ఇక ఫోనులో ఎనీ డెస్క్ యాప్ ఇన్ స్టాల్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆమె పూర్తి వివరాలు యాప్ లో నమోదు చేశారు. తర్వాత ఆమెకు నగదు రాకపోగా.. పలు దఫాలుగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.95వేలు మాయమయ్యాయి. విషయం గుర్తించిన ఆమె గురువారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మోసపోయానని గ్రహించి బావురుమన్నది.