Begin typing your search above and press return to search.

రోటీన్ కు భిన్నమైన ఈ ఆన్ లైన్ లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   25 Oct 2021 5:03 AM GMT
రోటీన్ కు భిన్నమైన ఈ ఆన్ లైన్ లవ్ స్టోరీ
X
ఆన్ లైన్ అన్నంతనే అపనమ్మకం.. అందులో నిజం కంటే అబద్ధమే ఎక్కువగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతుంటుంది. ఆన్ లైన్ ప్రేమాయణాలు మోసానికి గమ్యస్థానంగా ఉండటం.. మోసపోయి పోలీస్ స్టేషన్ కు చేరుకోవటం తెలిసిందే. ఇలాంటి వేళ.. రోటీన్ కు భిన్నంగా.. ఆన్ లైన్ మీద అంతో ఇంతో నమ్మకం కలిగించే లవ్ స్టోరీ తాజాగా బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన కుర్రాడు అమెరికా అమ్మాయితో స్నేహం చేయటం.. వారిద్దరి మధ్య అది కాస్తా పెరిగి పెద్దదై.. ప్రేమగా మారటమే కాదు. పెళ్లి పీటల మీదకు వచ్చి.. తాజాగా హైదరాబాద్ లో వారిద్దరి పెళ్లి జరిగింది. అయితే.. ఈ పెళ్లికి ముందు చాలానే కథ నడిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ శివారులోని గాజులరామారం ప్రాంతానికి చెందిన నల్లూరి రఘు కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్ డీ చేశారు. ప్రస్తుతం అమెజాన్ లో జాబ్ చేస్తున్నారు. అమెరికాలో చదువుకుంటున్న వేళలో.. ఆన్ లైన్ సెర్చ్ లో బటన్ కిస్ట్రా మ్యారీతో పరిచయం ఏర్పడింది. ఇదంతా 2016లో జరిగింది. వారి పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా టర్న్ తీసుకుంది. ఇదిలా ఉంటే.. దాదాపు రెండేళ్ల క్రితం అంటే 2019లో ఇండియాకు వచ్చేశాడు. ఇక్కడ జాబ్ లో సెటిల్ అయ్యాడు.

పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూస్తున్న వేళ.. తన ప్రేమ సంగతి చెబితూ.. దేశం కాని దేశం.. మనకు ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని చెబుతూ పెళ్లికి నో చెప్పేశారు. అయితే.. సంబంధాలు చూస్తున్న వేళ.. కట్నం.. ఆస్తులు.. కులం గురించి అదే పనిగా ప్రశ్నలు ఎదురవుతున్నవేళ.. తాను ప్రేమించిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు రఘు. దీంతో వారు సైతం కొడుకు మాటలకు కన్వీన్స్ అయి ఓకే చెప్పారు.

ఈ క్రమంలో దాదాపుగా మూడేళ్ల తర్వాత ఐటెన్ క్రిస్టామ్యారీకి ఫోన్ చేసిన రఘ.. తామిద్దరి పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకున్న విషయాన్ని చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకుందామని అడగ్గా.. అందుకు ఆమె ఓకే అనటమే కాదు.. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఆమె.. కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. అనేక మలుపులు ఉన్న ఈ రియల్ ఉదంతం.. రీల్ కు సూట్ అయ్యేలా అనిపించట్లేదు?