Begin typing your search above and press return to search.

కరోనా ఖర్మ: ఆన్ లైన్ లోనే పెళ్లిళ్లు.!

By:  Tupaki Desk   |   22 April 2020 12:30 AM GMT
కరోనా ఖర్మ: ఆన్ లైన్ లోనే పెళ్లిళ్లు.!
X
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆకాశమంత పందిరివేసి.. భూదేవి అంత చాప వేసి అట్టహాసంగా జరిపించేవారు. మనదేశంలో అయితే కోట్లు ఖర్చు పెట్టి నభూతో నభవిష్యతి అన్నట్టుగా చేసుకునే వారు.. కానీ ఇప్పుడు కరోనాతో ‘పెళ్లిళ్లు’ ఒక కలగా మారిపోయాయి. ఆన్ లైన్ లోనే పెళ్లి చేసుకునే ఖర్మ పట్టింది.

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అందరిలోనూ భయం ఆవహించింది. పెళ్లిళ్లు, పేరంటాలు సహా వేడుకలన్నీ రద్దు అయిపోతున్నాయి. ఇక కరోనా భయానికి పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా జనాలు భయపడిపోతున్నారు.

కరోనా వ్యాపిస్తుండడంతో మునుపటిలా అంగరంగ వైభవంగా వేలమందితో పెళ్లిళ్లు చేసుకోవడం కుదరదిక.. కరోనాతో కొత్త చిక్కులు తెచ్చుకునేందుకు ఎవరూ వేడుకలు చేసుకోవడం లేదు. తాజాగా కరోనా తీవ్రంగా ఉన్న న్యూయార్క్ లో ఆన్ లైన్ లోనే పెళ్లిల్లు చేసుకుంటుండడం విశేషంగా మారింది.

న్యూయార్క్ లో మే 15వరకు లాక్ డౌన్ పొడిగించారు. దీంతో అప్పటివరకు సామూహిక పెళ్లిళ్లు, వేడుకలు నిషేధం. న్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమో ఆన్ లైన్ పెళ్లిళ్లను లీగల్ చేశారు. తద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు. దీనికి మ్యారేజ్ లైసెన్స్ ఇస్తారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మ్యారేజీని బంధువులు, స్నేహితులంతా చూడొచ్చు. ఆన్ లైన్ లో ఆశీర్వదించవచ్చు. దీంతో ఆన్ లైన్లోనే జంటలు ఒక్కటైపోతున్న దైన్యం న్యూయార్క్ లో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని కొత్త జంటల భారంగా అంటున్నాయి.

అమెరికాలో లాక్ డౌన్ ఎత్తేసినా ఇప్పట్లో పెళ్లిళ్లు ఇతర శుభ కార్యాలయాలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో ఆన్ లైన్ పెళ్లిళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.