Begin typing your search above and press return to search.
ఘరానా దొంగ : ఆన్ లైన్ ప్రాజెక్ట్ పేరుతో రూ. 300 కోట్లు స్వాహా !
By: Tupaki Desk | 27 Nov 2021 12:30 AM GMTమోసపోయే వారు ఉన్నన్ని రోజులు మోసం చేసేవారు కూడా ఉంటారు అన్నట్టుగా ఎన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా కూడా అధిక డబ్బు కి ఆశ పడి మోసం పోయే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా రూ. 300 కోట్ల తో ఉడాయించాడు. ఆయన కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన మేరకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ ఎం పురం గ్రామానికి చెందిన మద్ది నాగేశ్వరరావు ఏడాదిగా ఎచ్చెర్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సూర్య నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆన్ లైన్ ప్రాజెక్టులు సంపాదించి వాటితో వ్యాపారం చేసేవాడు. పలువురు విద్యార్థుల వద్ద డబ్బు వసూలు చేసి ఈ ప్రాజెక్టు పనులు చేసేందుకు ఉద్యోగాలిచ్చాడు.
ఈ ప్రాజెక్టులు సాగుతుండగానే మరో భారీ మోసానికి తెరతీశాడు. ఈ ఆన్ లైన్ ప్రాజెక్టుల్లో తనతోపాటు పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని ప్రచారం చేశాడు. ఈ మాటలు నమ్మిన కొందరు మొదట్లో నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. వారికి నెలనెలా రూ.5 వేల వంతున లాభాల పేరిట ఇచ్చేవాడు. ఇదిచూసి మరికొందరు పెట్టుబడి పెట్టారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారమవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా అనేకమంది ఇందులో పెట్టుబడి పెట్టేవారు. దాదాపు 4 వేలమంది సుమారు రూ.300 కోట్ల మేర పెట్టుబడి పెట్టారు. వీరిలో కొందరు రూ.60 లక్షల వరకు ఇచ్చిన వారున్నారు.
డబ్బు తీసుకున్నట్లు కొందరికి చేత్తో రాసి ఇచ్చాడు. పెట్టుబడి పెట్టినవారికి లాభాల పేరుతో ఇస్తున్న డబ్బును మూడు నెలలుగా ఇవ్వడంలేదు. అడిగినవారికి ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వర్క్ పరిస్థితి మెరుగ్గా లేదని, కొన్ని రోజుల్లో బాగుపడుతుందని చెప్పేవాడు. పెట్టుబడి పెట్టినవారి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భార్య, ఇద్దరు పిల్లలతో సహా నాగేశ్వరరావు అదృశ్యమయ్యాడు. అతడి తల్లిదండ్రులు మాత్రం ఇక్కడున్నారు. నాగేశ్వరరావు కనిపించడంలేదని తెలిసిన తరువాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పోలీస్‌స్టేషన్ కు వెళ్తున్నారు. గురువారానికి 50 మంది వరకు ఎచ్చెర్ల పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల్లో నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు గురించి విచారణ కొనసాగిస్తున్నారు.