Begin typing your search above and press return to search.
ఆమెకు 20.. అతడికి 17.. ఆన్ లైన్ పరిచయం కాస్తా ఇంటికి పిలిచి మరీ!
By: Tupaki Desk | 12 May 2022 3:28 AM GMTగతానికి భిన్నంగా లైంగిక వేధింపులు అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా ఎదుర్కొంటున్నారు. అరుదుగా చోటుచేసుకునే ఈ పరిణామాలు ఇటీవల ఎక్కువైపోతున్న పరిస్థితి. తాజాగా అలాంటి విచిత్రమైన ఉదంతంఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది.కాకుంటే..ఈ ఎపిసోడ్ చివర్లో చోటుచేసుకున్న ట్విస్టు పుణ్యమా అని.. ఇప్పుడు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అసలేం జరిగిందంటే..
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ధారివికి చెందిన 20 ఏళ్ల అమ్మయికి ఆన్ లైన్ లో 17ఏళ్ల అబ్బాయి పరిచయమయ్యాడు. కొద్దికాలానికి ఆమె అతడికి లవ్ ప్రపోజ్ చేసింది. అందుకు ఆ బాలుడు నో చెప్పేశాడు. అయినప్పటికీ ఆమె అతడ్ని కోరుకోవటంతో.. తప్పక ఆమె ఫోన్ నెంబరును.. సోషల్ మీడియా ఖాతాల్ని బ్లాక్ చేవాడు. అయితే.. ఆమె మాత్రం అతడ్ని వేర్వేరు ఫోన్ నెంబర్లు.. సోషల్ మీడియా ఖాతాలతో అతడ్ని వేధించేది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆ కుర్రాడు ఉద్యోగ అన్వేషణలో భాగంగా ముంబయికి వచ్చాడు. వారి బంధవుల ఇంట్లో ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న ఆమె.. కలవాలని చెప్పి ధారావిలోని తన ఇంటికి ఆహ్వానించింది.
దీంతో.. ఆమె ఇంటికి వెళ్లిన ఆ కుర్రాడ్ని.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లైంగిక దాడికి పాల్పడింది. ఆ తర్వాత లాడ్జితో పాటు పలు ప్రాంతాలకు పిలిపించుకొని ఆమె లైంగికంగా వేధింపులకు గురి చేసేది.
దీంతో తట్టుకోలేని ఆ కుర్రాడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెపైన పోక్సో చట్టంలోని వివిద సెక్షన్ లకింద కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్టు మొదలైంది.
సదరు అమ్మాయి.. తనను బాలుడు.. అతడి కుటుంబ సభ్యులు కలిసి లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పేర్కొంటూ నవీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమె ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు. దీంతో.. ఎవరేం చేశారన్నది తేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద పడినట్లైంది.