Begin typing your search above and press return to search.
ఫేక్ జీపీఎస్ తో ఆన్‌లైన్ రమ్మీ ... రూ.70 లక్షలు మాయం !
By: Tupaki Desk | 9 Dec 2020 2:30 PM GMTఆన్ లైన్ గేమ్స్ .. ప్రస్తుత రోజుల్లో ఓ వ్యసనంలా మారిపోయింది. చాలామంది ఉదయం నుండి రాత్రి వరకు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆన్ లైన్ రమ్మీ ఆడే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆన్ లైన్ గేమ్ లకు బానిసలైపోతున్నారు కొందరు యువకులు ఆ తర్వాత అప్పులు చేసి మరీ గేమ్ లు ఆడుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయి చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక ఆన్ లైన్ రమ్మీ తో చాలామంది మోసపోతుండటంతో .. ప్రభుత్వం దీన్ని నిషేధించంది. అయితే ,ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగా నకిలీ జీపీఎస్ యాప్ లను ఉపయోగించి ఆన్ లైన్‌లో రమ్మీ ఆడుతూ లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆన్ లైన్ బెట్టింగ్ ల పై ఉక్కుపాదం మోపుతూ, 2017లోనే ఆన్‌లైన్ రమ్మీపై కూడా నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆన్ లైన్లో ఈ రమ్మీ గేమ్ ఆడేందుకు అవకాశం లేదు. ఇక్కడ ఈ గేమ్ ఆన్ లైన్ లో ఓపెన్ కూడా కాదు. అయినా.. కొందరు నకిలీ జీపీఎస్ ను ఉపయోగించి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఆన్లైన్ రమ్మీలో రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఫేక్ జీపీఎస్ ఉపయోగించి రమ్మీ ఆడుతూ లక్షలు పొగొట్టుకున్నాడు అంబర్‌పేట్ కు వాసి. రూ.70లక్షలు పొగొట్టుకొని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆ వ్యక్తి ఆశ్రయించాడు.
ఆన్ లైన్ రమ్మీ నిషేధం ఉండగా, ఎలా ఓపెన్ అయ్యిందంటూ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఫేక్ జీపీఎస్ తో రమ్మీ అడినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండేండ్లుగా రెండు ఐడీలతో బాధితుడు ఆన్ లైన్ రమ్మీ ఆడుతున్నాడు. అప్పులు చేసి ఆన్ లైన్ లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు. ఈ రోజు, రేపు, లాభాలొస్తాయంటూ అందులో పెట్టుబడులు పెడుతూ అప్పుల్లో కూరుకుపోవడం తో చివరికి పోలీసులని ఆశ్రయించాడు. అయితే రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీని నిషేధించిన నేపథ్యంలో , ఆన్లైన్ రమ్మీ ఆడి మోసపోతే చట్టరీత్యా నేరం. కాబట్టి పోలీసులు కూడా ఏమీ చేయలేరు జర జాగ్రత్త