Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ దుకాణాలు మూతపడుతున్నాయా?

By:  Tupaki Desk   |   28 Jan 2016 1:30 AM GMT
ఆన్ లైన్ దుకాణాలు మూతపడుతున్నాయా?
X
ఆన్ లైన్ షాపింగ్ కొన్నేళ్లుగా ఊపందుకున్న ఈ వ్యాపారం 2015లో మరింత స్పీడయింది. ఎన్నో అనుకూలతలు ఉండడంతోపాటు సమయానుకూలంగా మంచి ఆఫర్లు ఇస్తుండడంతో బయట ధరల కంటే తక్కువకు ఇంటి నుంచే కొనుగోలు చేసి ఇంటి వద్దకే తెప్పించుకుంటుండడంతో ఆన్ లైన్ షాపింగ్ బయట దుకాణాలను పూర్తిగా దెబ్బకొట్టింది. అయితే.. ఆన్ లైన్ లో పెద్ద పెద్ద కంపెనీల వ్యాపారం కూడా గాలి బుడగేనా అని ఇప్పుడనిపిస్తుంది.

ఆన్ లైన్ మార్కెట్ లో ఏనుగు లాంటి అమెజాన్.కామ్ వేల కోట్ల నష్టాన్ని అనౌన్స్ చేసింది. రెండేల్లలోనే బాగా బలపడినట్లుగా కనిపించిన పేటీఎం కూడా జేబులు ఖాళీ అవుతున్నాయని అంటోంది. తాజాగా జర్మనీకి చెందిన రాకెట్ ఇంటర్నెట్ కూడా దుకాణం బంద్ చేస్తామని చెబుతోంది. రాకెట్ ఇంటర్నెట్ అన్న పేరు మనకు కొత్తగా అనిపించినా జబాంగ్.కామ్ - ఫ్యాబ్ ఫర్నిస్ - ప్రింట్ వెన్యూ వంటి సైట్లు బాగా తెలిసినవే. ఆ సైట్లన్నీ రాకెట్ ఇంటర్నెట్ వే. ఇప్పుడవన్నీ దారుణంగా నష్టాల్లో ఉండడంతో వాటన్నిటినీ మూసేసి ఇండియాలో ఏదైనా సంస్థతో భాగస్వామిగా వ్యాపారం చేయాలని రాకెట్ ఇంటర్నెట్ భావిస్తోందట.

జబాంగ్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఇండియాలోని ఏదైనా సంస్తతో కలిసి అదేపేరుతో కొనసాగాలని భావిస్తున్నారు. ఫ్యాబ్ ఫర్నిస్ విషయంలో మాత్రం రాకెట్ ఇంటర్నెట్ చేతులెత్తేసింది. ఇండియాలో ఆన్ లైన్ లో ఫర్నిచర్ వ్యాపారం చేయలేమంటోంది. దాంతో ఫ్యాబ్ ఫర్నిస్ ను పూర్తిగా మూసేయడానికే నిర్ణయించింది.మొత్తానికి బాహుబలుల్లా కనిపిస్తున్న ఆన్ లైన్ షాపింగ్ సైట్లన్నీ ఒక్కొటొక్కటిగా నష్టాలు బయటపెడుతుండడంతో మళ్లీ సిటీల్లో దుకాణాలే గతా అని ఆన్ లైన్ కు అలవాటుపడిన వారంతా ఆందోళన చెందుతున్నారు.