Begin typing your search above and press return to search.
నరరూప రాక్షసుల డీటైల్స్ కోసం వెతుకులాట
By: Tupaki Desk | 4 Sep 2015 5:24 AM GMTఅప్పుడెప్పుడో నరరూప రాక్షసుడులాంటి నియంత హిట్లర్.. నాజీల మోజులో యూదుల్ని చిత్రహింసలకు గురి చేస్తూ వారి ప్రాణాల్ని తీసే దుర్మార్గం చరిత్ర పుస్తకాల్లో చాలానే చూశాం. ఇందుకు ఏ మాత్రం తగ్గకపోవటమే కాదు.. చిత్రవిచిత్రంగా.. అత్యంత పాశవికంగా హింసించి చంపేసే నరరూప రాక్షసుల వైఖరికి ఐఎస్ తీవ్రవాదుల్లో కనిపిస్తుంది. ఇస్లామిక్ స్టేట్ పేరు మీద సిరియా.. ఇరాక్ లలో వారు చేస్తున్న ఆరాచకం అంతాఇంతా కాదు.
అక్కడి ప్రజల్ని తీవ్ర అవస్థలకు గురి చేస్తూ.. మహిళలకు ఏ మాత్రం మర్యాద ఇవ్వని ఈ రాక్షసుల ఆరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఐఎస్ తీవ్ర వాదులకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్ లో వెతుకులాట బాగా పెరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారం నిఘా వర్గాలు సేకరించాయి.
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల గురించి తెలుసుకోవటం కోసం ఇంటర్నెట్ మాధ్యమంగా చేసుకొని సమాచారం వెతికే తీరు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందని చెబుతున్నారు. అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా సేకరించిన ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే ఆసక్తికర సమాచారం లభించక మానదు. ఐఎస్ తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం కోసం వెతుకుతున్న జనాభాలో అటు నగరాచెల్లోనే కాదు.. ఇటు పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు (ముఖ్యంగా 16 నుంచి 30 మధ్య వయస్కులు మాత్రమే) కూడా నెట్ లో వెతుకులాట పెరిగినట్లుగా గుర్తించారు. ఈ ధోరణి పట్ల రక్షణ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇక.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం వెతుకుతున్న టాప్ ఫైవ్ రాష్ట్రాల విషయానికి వస్తే..
= జమ్మూకాశ్మీర్
= అస్సాం
= ఉత్తరప్రదేశ్
= మహారాష్ట్ర
= పశ్చిమ బెంగాల్
ఇక.. నగర.. పట్టణ ప్రాంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
= శ్రీనగర్
= గౌహటి
= చించ్ వాడ్ (మహారాష్ట్ర)
= హౌరా
= ముంబయి
= ఉన్నావో
ఐఎస్ తీవ్రవాదుల గురించి ఆసక్తిగా నెటిజన్లు ఫాలో అవుతున్న టాప్ ఆరు దేశాల్ని చూస్తే..
1. ఉత్తర ఆసియా
2. ఇరాక్
3. సిరియా
4. ఎమిరేట్స్
5. నార్త్ ఈస్ట్ ఆఫ్రికా
6. వెస్ట్ యూరోప్