Begin typing your search above and press return to search.

ఆ తీర్మానాన్ని ఫాలో కాని సుప్రీం జ‌డ్జిలు!

By:  Tupaki Desk   |   3 July 2018 6:08 AM GMT
ఆ తీర్మానాన్ని ఫాలో కాని సుప్రీం జ‌డ్జిలు!
X
దేశంలోనే అత్యున్న‌త న్యాయ‌స్థాన‌మైన సుప్రీంకోర్టు జడ్జిల‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దేశంలో మ‌రెక్క‌డ న్యాయం జ‌ర‌గ‌కున్నా.. అంతిమంగా ఆశ్ర‌యించేది సుప్రీంకోర్టునే. మ‌రి.. అలాంటి న్యాయ‌స్థానంలో న్యాయ‌మూర్తులుగా వ్య‌వ‌హ‌రించే వారెంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. కానీ.. ఆ విష‌యంలో వారు చేస్తున్న త‌ప్పుల్ని బ‌య‌ట‌కు వెల్ల‌డ‌య్యాయి.

సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు త‌మ ఆస్తుల్ని.. అప్పుల్ని ప్ర‌క‌టించాల‌న్న తీర్మానం చేసి తొమ్మిదేళ్లు అవుతున్నా.. దాదాపు సంగం మంది న్యాయ‌మూర్తులు సైతం త‌మ వివ‌రాల్ని అంద‌జేయ‌లేద‌న్న కొత్త విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఉన్న 23 మంది జ‌డ్జిల‌కు 12 మంది మాత్రం త‌మ ఆస్తులు.. అప్పుల వివ‌రాల్ని వెల్ల‌డించిన‌ట్లుగా వెబ్ సైట్ పేర్కొంటోంది.

ఆస్తులు వెల్ల‌డించిన వారితో సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రాతో పాటు సీనియ‌ర్ న్యాయ‌మూర్తులు కొంద‌రు ఉన్నారు. అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు న్యాయ‌మూర్తులు త‌మ ఆస్తుల.. అప్పుల వివ‌రాల్ని వెల్ల‌డించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఆస్తులు.. అప్పుల వివ‌రాల్ని ప్ర‌క‌టించిన సుప్రీం న్యాయ‌మూర్తులు చూస్తే..

+ సుప్రీం ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా

+ సీనియ‌ర్ న్యాయ‌మూర‌తి జ‌స్టిన్ రంజ‌న్ గొగోయ్

+ జ‌స్టిస్ ఎంబీ లోకుర్

+ జ‌స్టిస్ కురియ‌న్ జోసెఫ్‌

+ జ‌స్టిస్ ఏకే సిక్రీ

+ జ‌స్టిస్ ఎస్ ఏ బాబ్డే

+ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

+ జ‌స్టిస్ అరుణ్ మిశ్రా

+ జ‌స్టిస్ ఏకే గోయ‌ల్‌

+ జ‌స్టిస్ ఆర్ భానుమ‌తి

+ జ‌స్టిస్ ఖ‌న్విల్క‌ర్‌

+ జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్

జాబితాలో లేని పేర్లు

- జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్‌

- జస్టిస్ ఏఎం.సప్రే

- జస్టిస్‌ యు.యు.లలిత్‌

- జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

- జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు

- జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌

- జస్టిస్‌ మోహన్‌ ఎం.శంతనగౌడర్‌

- జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

- జస్టిస్‌ నవీన్‌ సిన్హా

- జస్టిస్‌ దీపక్‌ గుప్త

- జస్టిస్‌ ఇందు మల్హోత్రా

ఆస్తులు.. అప్పుల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఆమోదించిన తీర్పు ఎప్ప‌టిది? అందులో ఏమున్న‌ద‌న్న‌ది చూస్తే..

1997లో తీర్మానం ప్ర‌కారం.. న్యాయ‌మూర్తులైన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎదుట త‌మ ఆస్తులు.. అప్పుల వివ‌రాల్ని వెల్ల‌డించ‌టంతో పాటు.. త‌న‌తో పాటు త‌న జీవిత భాగ‌స్వామి.. త‌న మీద ఆధార‌ప‌డే కుటుంబ స‌భ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివ‌రాల్ని ఉంచారు. అయితే.. ఈ తీర్మానం ప్ర‌కారం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. ఇత‌ర జ‌డ్జిల వివ‌రాల్ని వెల్ల‌డించకుండా ఉండే వీలుంది. అయితే.. 2007లో స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద స‌మాచారాన్ని కోరిన‌ప్పుడు.. ఈ విష‌యంపై జోక్యం చేసుకున్న ఢిల్లీ హైకోర్టు.. సుప్రీంజ‌డ్జిల ఆస్తుల వివ‌రాల్ని బాహాటంగా ప్ర‌క‌టించొచ్చు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.