Begin typing your search above and press return to search.

అమెరికాలో పాతుకుపోతున్న ఇండియన్స్

By:  Tupaki Desk   |   19 Oct 2018 7:34 AM GMT
అమెరికాలో పాతుకుపోతున్న ఇండియన్స్
X
అమెరికాలో భారతదేశ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. ఏడాదికి ఏడాది సంఖ్య రెట్టింపవుతుంది. గత 2017లో ముందెన్నడూ లేని విధంగా ఏకంగా 50,000 మందికి అమెరికా పౌరసత్వం లభించింది. గత సంవత్సరం కంటే దాదాపు 4వేల మందికి పైగా పెరిగారు.

ది డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అనే సంస్థ ఇచ్చిన తాజా నివేదికలో అమెరికాలో అగ్రస్థానంలో ఉన్న జనాభా వివరాలను వెల్లడించింది. భారత దేశ జనాభా అమెరికాలో పాతుకుపోతున్నట్లు పేర్కొంది. 2016లో 46,188 మంది అమెరికా పౌరసత్వం పొందగా - 2017లో 50,802 మంది వరకు ఉన్నారు. అదే 2015లో 42,213 పౌరసత్వం పొందినట్లు చెప్పింది. ఏటా ఇండియా జనాభా పెరుగుతున్న సూచీని వివరించింది.

అమెరికాలో పౌరసత్వం పొందుతున్న విదేశీలయుల లెక్కను తేల్చగా సంఖ్య క్రమేణా తరుగుతూ పోవడం గమనించదగ్గ విషయం. 2017లో పౌరసత్వం పొందిన వారి సంఖ్య 7,07,265 మంది కాగా - 2016లో 7,53,060 - 2015లో 7,30,259 మందిగా ఉన్నారు. రాష్ట్రాల వారీగా లెక్క వేసుకున్నా స్థిర నివాసాలు ఏర్పరచుకున్న భారతీయుల సంఖ్య గణనీయంగానే ఉంది.

మెక్సికోలో ఎక్కువ శాతం విదేశీయులు ఉంటున్నారు. 1,18,559 మందిలో రెండో స్థానంలో భారతీయులు నిలిచారు. అమెరికాతో పోల్చుకుంటే మిగతా దేశాల్లో చాలా తక్కువ మంది ఇండియన్స్ ఉంటున్నట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. చైనాలో 37,674 - ఫిలిప్పెన్స్ లో 36,828 - డోమినికన్ రిపబ్లిక్ లో 29,734 - క్యూబాలో 25,961 మాత్రమే ఉంటున్నారంట.

ఇక, అమెరికాలో పెరుగుతున్న జనాభాలో భారతీయులు స్త్రీ - పురుషుల వారీగా చూసుకుంటే.. స్త్రీలే అధికంగా ఉంటున్నారు. మగ జనాభా 3,10,987 మంది కాగా - అదే స్త్రీల జనాభా 3,96,234 మందిగా ఉంది. నివేదిక ప్రకారం కొత్తగా పౌరసత్వం తీసుకున్న వారిలో ఎక్కువ మంది కాలిఫోర్నియా లో ఉంటున్నారు.

యూఎస్ కు వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతూ పోతున్న, అదే స్థాయిలో జాత్యాహంకార దాడులు కూడా పెరుగుతున్నాయి. గన్ కల్చర్ కు అడ్డుకట్ట పడటం లేదు. భారతీయుల సంస్క‌ృతిని మరింత పెంపొందించడానికి తానా - ఆట - సిలికానాంధ్ర వంటి సంస్థలు పాటుపడుతున్నాయి