Begin typing your search above and press return to search.

కేసీఆర్ టైమిచ్చే ఆ న‌లుగురు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   15 Oct 2018 8:03 AM GMT
కేసీఆర్ టైమిచ్చే ఆ న‌లుగురు ఎవ‌రు?
X
సాధార‌ణంగా ఏ ముఖ్య‌మంత్రి అయినా త‌న అధికార నివాసంలోనూ.. లేదంటే స‌చివాల‌యంలో..కాదంటే ఏదైనా ప‌ర్య‌ట‌న‌లోనూ ఉంటారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి తాను సీఎంగా ఉన్న‌న్ని రోజులే కాదు.. ఇప్పుడు కూడా అత్య‌ధిక భాగంగా త‌న ఫామ్ హౌస్ కే ప‌రిమితం అవుతుంటారు. ఎవ‌రెన్ని చెప్పినా.. ఎంత గొప్ప‌గా పొగిడినా.. ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం ద‌గ్గ‌ర‌గా లేని ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నార‌ని చెప్పాలి. ఆ మాట‌కు వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కే కాదు.. సొంత పార్టీ నేత‌ల‌కూ ఆయ‌న అందుబాటులో ఉండ‌ర‌ని చెబుతారు.

ఇక‌.. కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన వారి గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. ఏ మంత్రికి స‌మ‌యం ఇవ్వ‌ని కేసీఆర్ తీరు మ‌న‌సులో బాధ‌గా ఉన్నా.. బ‌య‌ట‌కు చెప్పుకునే సాహ‌సం అస్స‌లు చేయ‌రు. ఇక‌.. కేసీఆర్ అందుబాటులో ఉండేది ఎవ‌రికంటే.. కొడుకు కేటీఆర్‌.. కుమార్తె కవిత.. మేన‌ల్లుడు హ‌రీశ్ ల‌కు మాత్ర‌మేన‌న్న పేరు ఉంది. మ‌రి.. సంతోష్ పేరు తేవొచ్చు.ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడు కావొచ్చు. కానీ.. కేసీఆర్ కు ఏళ్ల‌కు ఏళ్లుగా వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిగా ఉన్నార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఎంపీ అయ్యాక కూడా కేసీఆర్ కు సేవ‌లు చేస్తూ ఉండ‌టం క‌నిపిస్తుంది. అందుకే సంతోష్ ను ఆ జాబితా నుంచి మిన‌హాయించాలంటారు. మ‌రి.. నాలుగో వ్య‌క్తి ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. ఇదే విష‌యాన్ని కేంద్ర‌మంత్రి స‌దానంద గౌడ్ తాజాగా వెల్ల‌డించారు. కేసీఆర్ టైమిచ్చే నాలుగో వ్య‌క్తి మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీగా చెప్పారు. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజ‌మ‌ని చెబుతుంటారు.

త‌న ప్ర‌భుత్వాన్ని ప‌డేసే కుట్ర నుంచి కాపాడిన వ్య‌క్తిగా అస‌ద్ ను కేసీఆర్ న‌మ్ముతార‌ని చెబుతారు. ఈ కార‌ణంతోనే.. ఆయ‌న‌తో చాలా విష‌యాలు పంచుకుంటార‌న్న మాట ప్ర‌చారంలో ఉంది. అంతేనా.. కొన్ని సంద‌ర్భాల్లో త‌న తండ్రి కేసీఆర్ కు కొడుకు కేటీఆర్ చెప్పుకోలేని విష‌యాన్ని అస‌ద్‌కు చెప్పి.. ఆయ‌న ద్వారా కేసీఆర్ క చెప్పిస్తార‌న్న మాట‌ను కూడా చెబుతుంటారు. అదీ.. ఈ రోజు కేసీఆర్ ద‌గ్గ‌ర అస‌ద్ రేంజ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.