Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఆశయాలు కాదు.. నారా ఆశయాలు
By: Tupaki Desk | 10 Jun 2019 7:37 AM GMTకేంద్రంలో బీజేపీని గద్దెదించాలని.. మోడీని మరోసారి ప్రధాని కాకుండా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ప్రాంతీయ పార్టీలను జట్టుకట్టి కాంగ్రెస్ ను గద్దెనెక్కియ్యాలని చాలా రకాలుగా ప్రయత్నించారు. అయితే లక్ మోడీ పక్షాన నిలిచింది. ఆయన అఖండ మెజార్టీతో గెలవగా.. బాబు మాత్రం సొంత రాష్ట్రంలో ఓడి కనుమరుగయ్యాడు.
ఇప్పుడు బాబు ఓటమిపై తిరుపతి సభ సాక్షిగా మోడీ, కిషన్ రెడ్డిలు సెటైర్ వేశారు. ఓటమి తర్వాత కొందరు కనుమరుగయ్యారని.. వారి భవిష్యత్ ప్రశ్నార్థకమైందని బాబును ఉద్దేశించి మోడీ పరోక్ష విమర్శలు చేశారు. ఇక కిషన్ రెడ్డి మాత్రం డైరెక్ట్ అటాక్ చేశారు. చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టి ఎన్టీఆర్ ఆశయాలను నీళ్లొదిలిన బాబుకు ఏపీ ప్రజలు గట్టి బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నది ఎన్టీఆర్ ఆశయాలు కావని.. కేవలం నారా వారి ఆశయాలేనని సెటైర్లు వేశారు.
బీజేపీపై ఏపీ ప్రజల్లో చంద్రబాబు ఎంతో విషం చిమ్మారని.. మసిపూసి మారేడు కాయ చేశారని.. కానీ.. తిట్టిన బీజేపీ గెలవగా.. విషప్రచారం చేసిన బాబే కనుమరుగయ్యాడని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీని మట్టి కరిపించాలన్న బాబు అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.