Begin typing your search above and press return to search.
చరిత్రలో తొలిసారి ... 1,500 మందితోనే జగన్నాథ రథయాత్ర
By: Tupaki Desk | 23 Jun 2020 10:50 AM GMTప్రముఖ శ్రీ క్షేత్రం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భక్తులను అనుమతించకుండా రథయాత్రను కొనసాగిస్తున్నారు. ఒక్కో రథానికి 500 మంది చొప్పున మూడు రథాలను లాగడానికి కేవలం 1,500 మందిని మాత్రమే అనుమతించారు.వీరికి కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, నెగటివ్ వచ్చిన తర్వాతే యాత్రలో పాల్గొనడానికి అనుమతించడం విశేషం.
తొలుత ఆలయంలో జగన్నాథ స్వామికి కంకైర్యాలు నిర్వహించి, జగన్నాథ, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులను సర్వాంగ సుందరంగా అలకరించి రథాలపై ప్రతిష్టించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్వామి సేవలో ఉండే ‘సేవాయత్’ లే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతకు ముందు సంప్రదాయం ప్రకారం పూరీ రాజు బంగారు చీపురు పట్టుకుని రథాల ముందు ఊడ్చి, స్వామికి సేవలు నిర్వహించారు. భక్తులు పాల్గొనకుండా కేవలం ఏడు రోజుల పాటు మాత్రమే రథయాత్ర నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో చరిత్రలోనే తొలిసారిగా రథయాత్రలో కేవలం పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు.
ఏటా ఇసుక వేస్తే రాలనంత సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఈసారి ఆ కళే కనిపించట్లేదు. వైరస్ వ్యాప్తి... రథయాత్రను తీవ్రంగా దెబ్బతీసింది. అయినప్పటికీ సంప్రదాయాల్ని పాటిస్తూ... వేడుక నిర్వహిస్తున్నారు. ఇది మొత్తం 9 రోజులు జరిగే వేడుక. తొమ్మిది రోజుల తర్వాత రథాలు... గుండీచా ఆలయాన్ని చేరుకుంటాయి. ప్రపంచంలో ఏటా పూరీలో జరిగేదే ఇదే అతి పెద్ద రథోత్సవం. ఏటా లక్షల్లో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు.ఈ రథయాత్ర ద్వారా ఏటా పూరీ క్షేత్రానికీ, ఒడిసా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది. కొన్ని వేల మంది కళాకారులు, వ్యాపారులూ రథయాత్ర ద్వారా ఉపాధి పొందేవారు. ఈసారి అలాంటి వేవీ లేకుండా సాదాసీదాగా రథయాత్ర కార్యక్రమం జరుగుతుండటం భక్తులకు ఒకింత నిరుత్సాహం కలిగిస్తోంది.