Begin typing your search above and press return to search.
మొత్తానికి స్మితకు సారీ లాంటిది చెప్పారు
By: Tupaki Desk | 2 July 2015 1:04 PM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేషీలో పని చేస్తున్న అధికారిణి స్మిత సబర్వాల్ పై అవుట్‌లుక్ మ్యాగ్‌జైన్‌లో వచ్చిన సటైర్ వార్తపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.
ఒక మహిళను నీచంగా.. అసహ్యంగా .. అసభ్యంగా ప్రస్తావిస్తూ రాసిన కథనంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. తెలంగాణ సర్కారు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో బాధితురాలు స్మిత సబర్వాల్ స్పందిస్తూ తనకు జరిగిన నష్టంపై గళం విప్పటంతో పాటు.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయటం తెలిసిందే.
దీనిపై అవుట్ లుక్ మ్యాగ్ జైన్ తాజాగా స్పందించింది. తమకు నోటీసులు పంపినట్లు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయని.. సోషల్ మీడియాలోనూ దీనిపై గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్న సదరు మీడియా సంస్థ.. తాము ప్రచురించిన కథనం ఎవరిని కించపరచాలన్న ఉద్దేశ్యం తమకు లేదని.. కథనంలో ఎక్కడా పేర్లు ప్రస్తావించలేదని తెలిపింది.
ఇలాంటి కథనాల్ని వ్యంగ్యంగా భావించి తేలిగ్గా తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ ఈ కథనం నొప్పించినా.. బాధ కలిగిస్తే విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. తాము వివిధ సామాజిక అంశాల మీదా.. మహిళలు.. మైనార్టీల హక్కుల్ని కాపాడటానికి మొదటి వరుసలో ఉన్నట్లు పేర్కొంది. మొత్తానికి క్షమాపణలు చెప్పకుండా.. అలా అని సారీ చెప్పలేదన్న మాట రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అవుట్ లుక్ వైఖరి కనిపిస్తోంది.