Begin typing your search above and press return to search.
వారికి 'వందేమాతరం' అనే హక్కు లేదు: మోదీ
By: Tupaki Desk | 12 Sep 2017 12:11 PM GMTపరిసరాల పరిశుభ్రతను విస్మరించేవారికి, భరతమాతను అగౌరవ పరిచేవారికి ‘వందేమాతరం’ అని నినదించే హక్కు లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వామి వివేకానంద షికాగోలో చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి 125 ఏళ్లు నిండిన సందర్భం, బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ భారత్’ ఆవశ్యకతను మోదీ పునరుద్ఘాటించారు. దేశ ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతమవడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
‘నేను సభా ప్రాంగణానికి వచ్చినపుడు అందరూ వందేమాతరం అని నినదిస్తున్నారు. నేను దేశ పౌరులందరికీ వందేమాతరం అని నినదించే హక్కు ఉందా అని అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్న చాలా మందికి బాధ కలిగించి ఉంటుంది. పాన్ ను నమిలి భరతమాతపై ఉమ్ముతున్నాం. అదే నోటితో ‘వందేమాతరం’ అని ఎలా అనగలం? ’ అని మోదీ ప్రశ్నించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వందేమాతరంపై తొలి హక్కు వారిదేనని స్పష్టం చేశారు.
యూనివర్సిటీ ఎన్నికల్లో పరిశుభ్రతను ప్రధానాంశంగా ప్రచారం చేయాలని విద్యార్థి సంఘాలను మోదీ కోరారు. ‘యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రతిసారీ విద్యార్థి సంఘాలు పెద్ద పెద్ద హామీలు ఇస్తుంటాయి. ఒక్కసారైనా వారు క్యాంపస్ ను పరిశుభ్రంగా ఉంచుతామని హామీ ఇచ్చారా’ అని మోదీ ప్రశ్నించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి పారిశుద్ధ్య కార్మికులే తప్ప ఖరీదైన వైద్యులు కారణం కాదని మోదీ అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ చాలామంది దేశ ప్రజలు స్వచ్ఛత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిచడం పై ప్రధాని అసంతృప్తితో ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.