Begin typing your search above and press return to search.
స్వరూపనందేంద్రస్వామికి సీఎంల శుభాకాంక్షలు మాత్రమే!
By: Tupaki Desk | 1 Nov 2019 9:47 AM GMTతెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులతో మొన్నటి వరకూ చాలా సన్నిహితంగా కనిపించారు విశాఖ శారద పీఠాధపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఎన్నికలకు ముందు అయితే స్వామీజీ ఒక వెలుగు వెలిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్లు శారద పీఠాన్ని సందర్శించారు.
ఇక ఎన్నికల తర్వాత స్వామీజీకి మరింత క్రేజ్ పెరిగింది. ఆఖరికి సీఎం హోదాలోని వైఎస్ జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది స్వరూపానందేంద్రను దర్శించుకున్నారు కూడా! అలా అదొక అధికార పీఠం అవుతోందనే ఊహాగానాలు వినిపించాయి.
అయితే పరిస్థితుల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తూ ఉంది. స్వరూపానందేంద్ర సరస్వతి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే ఆ కార్యక్రమాలకు ఇరు రాష్ట్రాల సీఎంలూ హాజరు కాలేదు. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు.
ఏపీ రాజకీయ ప్రముఖులు మాత్రం హాజరయ్యారు. సీఎం జగన్ తరఫున ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.ఇక ఏపీకి చెందిన పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు వెళ్లారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా శారద పీఠాధిపతి పుట్టిన రోజు వేడులకు హాజరయ్యారు.
ఇత రాజకీయ ప్రముఖులు హాజరైనా.. సీఎంలు మాత్రం అటు వైపు వెళ్లలేదు. వెళితే మరిన్ని ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చినట్టుగా అవుతుందని అనుకున్నారో ఏమో కానీ.. సీఎంలిద్దరూ శుభాకాంక్షలు తెలిపి కామ్ అయ్యారు.