Begin typing your search above and press return to search.
ఆ ఇంట్లో అత్యాచారం చేస్తానా అంటున్న సీఎం
By: Tupaki Desk | 9 April 2016 9:23 AM GMTఎన్నికల వేళ ఏ ముఖ్యమంత్రికి ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితి కేరళ సీఎం ఉమెన్ చాందీకి చుట్టుకుంది. పలు కుంభకోణాలతో కిందామీదా పడుతున్న ఆయనకు.. అవి చాలవన్నట్లుగా తనను రేప్ చేశారంటూ ఏకంగా ముఖ్యమంత్రి మీదనే ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన సరితానాయర్ వ్యవహారం తెలిసిందే. సోలార్ కుంభకోణంలో నిందితురాలైన ఆమె.. ముఖ్యమంత్రి తనపై అత్యాచారం చేశారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఒకపక్క ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. తనపై వస్తున్న ఈ తరహా ఆరోపణలపై ఉమెన్ చాందీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తన ప్రత్యర్థులు తనపై దారుణ ఆరోపణలు చేస్తున్నట్లగా వాపోతున్న ఆయన.. సరితానాయర్ ను అత్యాచారం చేశారన్న మాటలో నిజం ఎంతమాత్రం లేదని చెబుతున్నారు. తన మీద వస్తున్న ఆరోపణలపై మండిపడ్డ ఆయన.. ముఖ్యమంత్రి అధికార బంగళా అయిన క్లిఫ్ హౌస్ లో రేప్ చేశాననటం అర్థరహితమని వ్యాఖ్యానించారు. ఓపక్క సెక్యూరిటీ.. మరోపక్క కుటుంబం ఉన్న ఇంట్లో మానభంగం సాధ్యమయ్యే పనా? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.
సోలార్ కుంభకోణంలో పోలీసుల అదుపులో ఉన్న సమయంలో సరితానాయర్ రాసినట్లుగా చెబుతున్న లేఖల్ని తాజాగా రెండు టీవీ ఛానళ్లు ప్రస్తారం చేయటం ఈ ఇష్యూ కేరళలో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఆ లేఖ దొంగదని.. తనను అప్రతిష్టపాలు చేయటానికే పన్నిన కుట్రగా ఉమెన్ చాందీ ఆరోపిస్తున్నారు. ఏమైనా ఒక సీఎం గురించి రేప్ తరహా తీవ్ర ఆరోపణలు రావటం ఇప్పటివరకూ దేశంలో లేదనే చెప్పాలి. ఎన్నికల వేళ.. ఇలాంటి విపత్కర పరిస్థితి ఉమెన్ చాందీని ఏ తీరానికి చేరుస్తుందో..?