Begin typing your search above and press return to search.
ఏపీలో ఎందుకు ఉప ఎన్నికలు లేవంటే...
By: Tupaki Desk | 6 Oct 2018 4:18 PM GMTఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు దేశ రాజకీయాల్లో కొద్దికాలం కిందట హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం...ఏపీ భవిష్యత్తుకు కీలకమైన ప్రత్యేక హోదాను సాధించేందుకు....ఇంకో ఏడాది కాలం పాటు పదవీ కాలం ఉండగా...వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడమే కాకుండా...తమ రాజీనామాలను ఆమోదించాలంటూ..వారు పట్టుబట్టి మరీ ఆమోదించుకున్న తీరు... ఈ ఆసక్తికి కారణం అయింది. ఐదుగురు వైఎస్ ఆర్ సీపీ ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను వైసీపీ ఎంపీలు ఆమోదం పొందించుకున్న నేపథ్యంలో ఉప ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అయితే, తాజాగా ఈసీ ఈ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చింది. ఉప ఎన్నికల జరగబోవని స్పష్టం చేసింది.
తెలంగాణతో పాటు నాలుగు రాష్ర్టాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవని - సాధారణ ఎన్నికల వరకూ ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ``ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించారు. లోక్ సభ గడువు వచ్చే జూన్ 3తో ముగుస్తుంది. ఇంకా కేవలం ఏడాదిలోపే సమయం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు నిర్వహించబోం` అని తేల్చి చెప్పారు.