Begin typing your search above and press return to search.
అన్నాడీఎంకేలో సెల్వం ఇంకో ట్విస్ట్ ఇచ్చారు
By: Tupaki Desk | 16 Jun 2017 4:57 AM GMTతమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విలీన వ్యవహారం అటకెక్కడంతో అన్నాడీఎంకె వైరి వర్గాల మధ్య మళ్లీ సమరం మొదలైంది. అసలు అన్నాడీఎంకె తమదేనని, తమకే అధికారిక రెండాకుల గుర్తు దక్కాలంటూ మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం - అటు ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా బల ప్రదర్శనకు దిగుతున్నారు. లారీలు - సుమోలను రంగంలోకి దింపి తమకు ఉన్న బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తు తమకే దక్కాలని కోరే వారు అందుకు తగిన ఆధారాలను అందించాలంటూ ఇరు వర్గాలకు ఈసీ విధించిన గడువు సమీపించడంతో అఫిడవిట్ల దాఖలు ఊపందుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం - ప్రధానకార్యదర్శి శశికళ వర్గం అధికార అన్నాడీఎంకె గుర్తు తమదేనని రుజువు చేసుకునేందుకే ఈసీకి అఫిడవిట్లను ఓ పరంపరగా అందిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితమే శశికళ వర్గం నాలుగు లారీల్లో తెచ్చిన అఫిడవిట్లను ఈసీకి అందించింది. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం గ్రూపు గురువారం ఎన్నికల కమిషన్ కు రెండు వాహనాల్లో తెచ్చిన అఫిడవిట్లను సమర్పించింది. పన్నీర్ వర్గం లక్షా 80వేల అఫిడవిట్లను తమ వాదనకు మద్దతుగా ఈసీకి సమర్పించినట్టు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/